News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత; తెలంగాణలో చేతులు కలిపిన ప్రత్యర్థులు - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

చంద్రబాబుకు హైకోర్టులో షాక్

స్కిల్‌ డెవలప్‌మెట్‌ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టిసిన హైకోర్టు తీర్పుకాపీలో చాలా ఆంశాలపై క్లారిటీ ఇచ్చింది. సెక్షన్‌ 482 సీఆర్‌పీసీకీ సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని పేర్కొంది. నిహారిక ఇన్‌ఫ్రా vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసును న్యాయమూర్తి ఉదహరించారు. ఇన్ని ఆధారాలున్న ఈ కేసులో క్వాష్‌ పేరిట ఇప్పుడు మినీ ట్రయల్‌ నిర్వహించలేమని స్పష్టం చేసింది. 2021 నుంచి ఇప్పటివరకు 140 మంది సాక్షులను సీఐడీ విచారించిందని తెలిపింది. దాదాపు 4వేల డాక్యుమెంట్‌ ఆధారాలను పరిశీలనలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిందని కోర్టు భావిస్తోందన్నారు. ఇంకా చదవండి

తెలంగాణలో త్వరలో బీసీ సర్వే

బీసీల్లో వివిధ కులాల రాజకీయ ప్రాతినిధ్యంపై త్వరలో సర్వే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఇప్పటికే ఓబీసీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో బీసీలకు నిర్ణీత రిజర్వేషన్లు లేవు. జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగించిన తర్వాత బీసీలకు 20% కోటా లభిస్తుంది. ఇంకా చదవండి

చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

అసెంబ్లీలో స్కిల్‌ స్కామ్‌పై చర్చ సందర్భంగా మాజీమంత్రి కన్నబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి ఒప్పందమే అని చెప్పుకొచ్చారు. కేబినెట్‌లో అప్రూవ్‌ చేసింది ఒకటిని, ఒప్పందం చేసుకుంది మరొకటి అని వివరించారు. కరెంట్‌ పోతే చీకట్లో సంతకాలు పెట్టామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే స్కిల్‌ స్కామ్‌ జరిగిందని చెప్పారు. అలాగే సెక్రటేరియట్‌లో నోట్‌ ఫైళ్లు మొత్తం మాయం చేశారని ఆరోపించారు. అప్పటి కేబినెట్‌నే చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఫైర్ అయ్యారు. యువతకు శిక్షణ పేరుతో దోచుకున్నారని.. విజనరీ అనే చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు ప్రిజనరీగా మారారని మండిపడ్డారు. ఇంకా చదవండి

చేతులు కలిపిన ప్రత్యర్థులు

బీఆర్‌ఎస్‌లో ఉప్పునిప్పులా ఉండే ఇద్దరు నేతలు చేతులు కలిపారు. తన ప్రత్యర్థి విజయం కోసం ప్రయత్నిస్తానని  చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో హైలైట్‌గా నిలిచింది.  స్టేషన్ ఘన్‌పూర్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే రెండు పేర్లు కడియం శ్రీహరి, రాజయ్య. ఎప్పటి నుంచో వీళ్లిద్దరి మధ్య రాజకీయం మండుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు నేరుగానే విమర్శలు చేసుకుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో వీళ్ల రాజకీయం ఏ స్థాయికి వెళ్తుందో అన్న కంగారు బీఆర్‌ఎస్ పార్టీలో ఉండేది. అంచనాలను తలకిందులు చేస్తూ కడియం శ్రీహరి, రాజయ్య చేతులు కలిపారు. ఇంకా చదవండి

తిరుమలకు పోటెత్తిన భక్తులు, మూడు లక్షల మందికి పైగా వచ్చే అవకాశం!

శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన 5వ రోజుకు వార్షికోత్సవాలు చేరుకున్నాయి. స్వామి వారు నేడు రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇవనున్నారు. గరుడ వాహనంపై విహరించనున్న శ్రీవారికి మూల విరాట్టుకు అలంకరించే సహస్ర నామాల మాల, లక్ష్మీ కాసుల మాల, పచ్చల హారం స్వామి వారికి అలంకరిస్తారు. అలాగే పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడిని అవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. ఇంకా చదవండి

Published at : 22 Sep 2023 02:32 PM (IST) Tags: Breaking News Andhra Pradesh News Todays Top news Telangana LAtest News

ఇవి కూడా చూడండి

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

ABP Desam Top 10, 8 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 8 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Babu Gogineni: మహిళలకు ఉచిత ప్రయాణంపై విమర్శలా? బాబు గోగినేని దిమ్మతిరిగే సమాధానం

Babu Gogineni: మహిళలకు ఉచిత ప్రయాణంపై విమర్శలా? బాబు గోగినేని దిమ్మతిరిగే సమాధానం

టాప్ స్టోరీస్

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?

CM Jagan Vs TDP :   టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం -  అంతా జగనే చేశారా ?