By: ABP Desam | Updated at : 22 Sep 2023 12:41 PM (IST)
Edited By: jyothi
చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి ఒప్పందమే, అసెంబ్లీలో స్కిల్ స్కాంపై కన్నబాబు కామెంట్లు
Chandrababu Arrest: అసెంబ్లీలో స్కిల్ స్కామ్‌పై చర్చ సందర్భంగా మాజీమంత్రి కన్నబాబు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుదుర్చుకుంది చీకటి ఒప్పందమే అని చెప్పుకొచ్చారు. కేబినెట్‌లో అప్రూవ్ చేసింది ఒకటిని, ఒప్పందం చేసుకుంది మరొకటి అని వివరించారు. కరెంట్ పోతే చీకట్లో సంతకాలు పెట్టామనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పక్కా ప్లాన్ ప్రకారమే స్కిల్ స్కామ్ జరిగిందని చెప్పారు. అలాగే సెక్రటేరియట్‌లో నోట్ ఫైళ్లు మొత్తం మాయం చేశారని ఆరోపించారు. అప్పటి కేబినెట్‌నే చంద్రబాబు తప్పుదారి పట్టించారని ఫైర్ అయ్యారు. యువతకు శిక్షణ పేరుతో దోచుకున్నారని.. విజనరీ అనే చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు ప్రిజనరీగా మారారని మండిపడ్డారు. మొత్తం 17 మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేశారని చెప్పుకొచ్చారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశారని కన్నబాబు తెలిపారు. ఏడుగురు నిందితులు బెయిల్‌పై బయటకొచ్చారని వివరించారు. బెయిల్ మీద వచ్చిన సుమన్ బోస్‌కు చంద్రబాబు మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతిని ఐటీ బట్ట బయలు చేసిందన్నారు. ఎన్టీఆర్ అంత గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారని.. చంద్రబాబు ఆదేశాల మేరకు స్కిల్ నిధులను విడుదల చేశారని తెలిపారు. స్కిల్ స్కామ్ నిధులు నేరుగా తన ఖాతాలోకే వస్తాయి కాబట్టి.. దానిపై చంద్రబాబుకు అంత ప్రేమ అంటూ వ్యాఖ్యానించారు. టన్నులు అంటే బరువు కాదు.. కోట్లు అనే అర్థం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నారని, ఒకే రోజు.. ఒకే విధంగా రూ. 371 కోట్లు రిలీజ్ చేశారని కన్నబాబు వివరించారు. అలాగే బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట అని తెలిపారు. వాదనలు విన్న తర్వాతే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిందని వివరించారు.
డొల్ల కంపెనీలు పెట్టి చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారని కన్నబాబు ఆరోపించారు. ఏ మొహం పెట్టుకుని నీతి పాలన చేశామని చెప్పుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. డబ్బులను రకరకాల అకౌంట్‌లలోకి మళ్లించారని తెలిపారు. అలాగే రూ. 371 కోట్ల స్కామ్ జరిగితే అది పెద్ద స్కామా అంటూ యెల్లో మీడియా సిగ్గు లేకుండా కథనాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కానుకలోనూ అవినీతి చేశారని, బాబు హయాంలో బెల్లం స్కామ్ కూడా జరిగిందిని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసులోనూ అడ్డంగా దొరికిన చంద్రబాబు చేసిన నేరాలకు జైల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని సూచించారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు చంద్రబాబు పంచాని విమర్శించారు. యెల్లో మీడియా చూపిస్తున్నది అంతా అసత్యాలేనని.. తోమంది సీజేలను చూసి ఇప్పుడు రాజమండ్రి సీజేలో ఊచలు లెక్క పెడుతున్నాడని కామెంట్లు చేశారు.
Read Also: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు పొడగించింది. చంద్రబాబు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ శుక్రవారం ముగిసింది. ఈక్రమంలోనే తదుపతి ఆదేశాల కోసం ఆయనను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వర్చువల్ పద్ధతిలో హాజరు పరిచారు. దీంతో చంద్రబాబు రిమాండ్ ను ఈనెల 24వ తేదీ వరకు కోర్టు పొడగించింది.
Telangana Power statistics: డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే, వాస్తవాలు వెల్లడించిన బీఆర్ఎస్
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
ABP Desam Top 10, 9 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>