By: ABP Desam | Updated at : 22 Sep 2023 12:30 PM (IST)
అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన టీడీపీ- స్పీకర్ తీర్పుపై తీవ్ర విమర్శలు
స్పీకర్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తు స్పీకర్ అనురిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అందుకే సభలో సరైన గౌరవం లేకపోవడంతోపాటు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకే సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు పేర్కొన్నారు.
అధికారంపక్షం, స్పీకర్ తీరుకు నిరసనగా సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. శనివారం నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ప్రకటించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శాసనసభను వైసీపీ కార్యాలయంలా మర్చేశారని ఆరోపించారు. సభలో సభ్యుల హక్కులకు భంగం కలిగించారని ధ్వజమెత్తారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అందరనీ సమానంగా చూడాలని కానీ తమకు యూజ్‌లెస్‌ఫెలోస్ అంటూ తిట్టడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై కేసులు ఎత్తివేసి క్షమాపణ చెబితే ప్రత్యేక సమావేశాలు పెట్టి అవినీతిపై చర్చిద్దామని సవాల్ చేశారు అచ్చెన్న. బాబును అసెంబ్లీకి తీసుకొచ్చి చర్చించడానికి సిద్ధమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్న మిగ్జాం తుపాను- అధికార యంత్రాంగం అప్రమత్తం
అన్ని తుపానులకు ఎందుకు పేర్లు పెట్టరూ? మిగ్జాం అంటే అర్థమేంటీ?
Cyclonic Michaung live updates: దూసుకొచ్చిన తుపాను-బాపట్ల దగ్గరగా తీరం దాటే అవకాశం
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>