Tirupati Crime News: తిరుపతి వ్యభిచారం కేసులో ఎస్సై తమ్ముడు, తల్లి అరెస్టు- తప్పుంటే ఆమెపై కూడా చర్యలు: డీఎస్పీ
Tirupati Crime News: మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తూ చిక్కిన వారిలో ఓ మహిళా ఎస్సై తల్లి, తమ్ముడు ఉండటం పోలీసులే షాక్ తింటున్నారు.
Tirupati Crime News: తిరుపతిలో వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకుల్లో ఓ ఎస్సైకు చెందిన ఫ్యామిలీ ఉండటం పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. ఆమె హస్తం కూడా ఉందన్న ఆరోపణలు ఉన్నాయంటున్నాయి పోలీసు వర్గాలు.
నిరంతరం ప్రజలను రక్షించి.. మీకు మేము ఉన్నాం అంటూ భరోసా కల్పించాల్సిన పోలీసులు పెడదారి పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశయాలతో దిశ చట్టంతో పాటు దిశ పోలీసు స్టేషన్‌లను ఏర్పాటు చేయగా.. వీటిని రక్షించాల్సిన పోలీసు మాత్రం అరాచకాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తూ చిక్కిన వారిలో ఓ మహిళా ఎస్సై తల్లి, తమ్ముడు ఉండటం పోలీసులే షాక్ తింటున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అధిక మొత్తంలో డబ్బులు సంపాధించాలనే ఆశతో..
ఆధ్యాత్మిక నగరంగా పేరు గాంచిన తిరుపతి నగరంలో అపచారం జరిగింది. ఈ మధ్య కాలంలో వ్యభిచార కూపాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేసినా, శిక్షలు విధించినా ఏదో ఒక మూల వ్యభిచార గృహాలు పుట్ట గొడుగులుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి నగరంలోని ముత్యాలరెడ్డి పల్లెలో సీఐ సురేంద్రనాధ్ రెడ్డి సమక్షంలో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ మహిళా ఎస్సై తల్లితోపాటుగా, మహిళా ఎస్సై తమ్ముడిని, ఒక విటుడుని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు మహిళలను హోంకి తరలించారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదనకు అలవాటు పడిన వీళ్లు కొద్ది నెలలుగా గుట్టు చప్పుడు ముత్యాలరెడ్డి పల్లె పోలీసు స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మి నగర్ లోని సొంత ఇంటినే వ్యభిచార గృహంగా మార్చి వివిధ ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి కుటుంబ సభ్యుల సహకారంతో మహిళతో వ్యభిచారం నడిపిస్తూ వస్తొంది.
మహిళా ఎస్సై తల్లితో పాటు తమ్ముడి అరెస్ట్
ఏడాది క్రితం ఆ మహిళా ఎస్సైకి వివాహం కావడంతో తిరుపతిలో విధులు నిర్వర్తిస్తూ భర్తతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి పోలీసులకు ఓ సమాచారం వచ్చింది. ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఆ మెసేజ్ సారాంశం. రహస్య సమాచారంతో ధనలక్ష్మీ నగర్ లో ఉన్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. దీంతో మహిళా ఎస్సై ఫ్యామిలీ నిర్వాకం బట్టబయలు అయ్యింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలను హోంకు తరలించగా, తిరుచారునూరుకు చెందిన విటుడిని, మహిళా ఎస్సై తల్లిని, తమ్ముడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఘటనపై స్పందించిన డీఎస్పీ నరసప్ప..!
తిరుపతి రూరల్ మండలం డీఎస్పీ నరసప్ప కథనం మేరకూ మహిళా ఎస్సైకి ఏడాది క్రితమే వివాహం అయింది. దీంతో ఆమె భర్తతో కలిసి బైరాగిపట్టెడలో నివసిస్తున్నారు. మహిళా ఎస్సై తల్లి, సోదరుడు ముత్యాలరెడ్డి పల్లి సమీపంలోని ధనలక్ష్మి నగర్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి ఇంటిపై దాడి చేశారు. మహిళా ఎస్సై తల్లి, ఆమె సోదరుడితో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన మరో ఇద్దరు యువతులను హోంకు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసుపై పూర్తి స్ధాయిలో వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మహిళా ఎస్సైకి వ్యభిచార గృహంలో హస్తం ఉన్నట్లు తెలిస్తే.. కచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి రూరల్ మండలం డీఎస్పీ నరసప్ప తెలిపారు.