TikTok: టిక్‌టాక్‌లో వీడియోలు చూడండి, గంటకు 100 డాలర్లు గెలుచుకోండి - ఆఫర్ కొద్ది రోజులే
TikTok: అమెరికాలోని ఓ మార్కెటింగ్ ఏజెన్సీ టిక్‌టాక్‌లో 10 గంటల పాటు వీడియోలు చూసిన వారికి గంటకు 100 డాలర్లు ఇస్తామని ప్రకటించింది.
TikTok:
మార్కెటింగ్ ఏజెన్సీ ఆఫర్
టిక్‌టాక్‌ని బ్యాన్ (TikTok Ban) చేసి చాలా రోజులైనా...ఇంకా ఆ యాప్ గురించి మాట్లాడుకూనే ఉంటారు నెటిజన్లు. ఒకప్పుడు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసిన ఈ చైనా యాప్‌పై కేంద్రం నిషేధం విధించింది. వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తున్నారన్న కారణంగా యాప్‌స్టోర్ నుంచి తొలగించింది. భారత్ మాత్రమే కాదు. ఇంకా కొన్ని దేశాలు కూడా టిక్‌టాక్‌ని బ్యాన్ చేశాయి. అయితే...అమెరికాలో మాత్రం టిక్‌టాక్ యూజర్స్‌కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది ఓ కంపెనీ. అక్కడి యూత్ గంటల కొద్ది టిక్‌టాక్‌పైనే స్పెండ్ చేస్తోంది. అలా ఊరికే టైమ్ వేస్ట్ చేసుకునే బదులుగా..టిక్‌టాక్ వీడియోలు చూసి డబ్బులు సంపాదించండి అని ప్రకటన చేసింది. Ubiquitous అనే ఓ మార్కెటింగ్ ఏజెన్సీ...ఈ ఆఫర్ ఇచ్చింది. బింగే వాచ్ (కంటిన్యూగా చూడడం) చేసిన వారికి నజరానా ఇస్తామని చెప్పింది. ఇంతకీ ఆఫర్ ఏంటనేగా మీ డౌట్. ఎవరైతే 10 గంటల పాటు ఆపకుండా టిక్‌టాక్‌లో వీడియోలు చూస్తారో..వాళ్లకు గంటకు 100 డాలర్ల చొప్పున లెక్కగట్టి ఆ మొత్తాన్ని ఇచ్చేస్తుంది. ఇందుకోసం ముగ్గురు వ్యక్తులు అవసరం అని వెల్లడించింది. ఆ ముగ్గురూ...10 గంటల పాటు ఆగకుండా వీడియోలు చూడాలి. అప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇదేం పిచ్చి అనుకోవచ్చు కానీ...ఆ కంపెనీ దీనికి రీజన్ ఏంటో కూడా చెప్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోడానికే ఈ ఆఫర్ పెట్టిందట. ఆ వీడియోలు చూసే వాళ్లకు చిన్న టాస్క్ కూడా చెప్తారు. అదేంటంటే...ప్రస్తుతం ఏ ట్రెండ్ నడుస్తోంది..? వేటిని ఎక్కువగా జనాలు ఇష్టపడుతున్నారు..? లాంటి అంశాలను నోట్ చేసుకోవాలి. చిన్న డాక్యుమెంట్‌ని ఫిల్ చేసి ఇస్తే సరిపోతుంది.
ఆఫర్ కావాలంటే..
ఈ ఆఫర్ కావాలంటే Ubiquitous యూట్యూబ్ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ఆ తరవాత ఈ కాంపిటీషన్‌లో ఎందుకు పాల్గొనాలంటుకున్నారో చిన్న నోట్ పంపాలి. ఇక్కడ ఓ కండీషన్ ఉంది. ఇందులో పాల్గొనాలనుకునే వారికి 18 ఏళ్లు నిండాలి. టిక్‌టాక్ అకౌంట్ ఉండాలి. టిక్‌టాక్ ట్రెండ్స్‌పై పూర్తి అవగాహన ఉండాలి. ఇలా వీడియోలు చూసిన తరవాత వాళ్లు ఏదైనా సోషల్ మీడియాలో తమ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉందో పోస్ట్ చేయాలి. ఆ పోస్ట్‌లో తప్పనిసరిగా...Ubiquitous ని ట్యాగ్ చేయాలి. సోషల్ మీడియాపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు..కేవలం ఆ పోస్ట్‌లు చూసి వదిలేయకుండా..వాటితో డబ్బు సంపాదించుకునేలా చేయాలనేదే మా ఉద్దేశం అని కంపెనీ ఓనర్ చెప్పాడు. మే 31వ తేదీతో ఈ ఆఫర్ గడువు ముగిసిపోతుంది. 2017లో అందుబాటులోకి వచ్చిన టిక్‌టాక్ యాప్ కొద్ది కాలంలోనే పాపులర్ అయింది. అమెరికాలో నాలుగో అతి పెద్ద సోషల్ నెట్‌వర్క్‌గా ఎదిగింది. అమెరికాలోని యూత్ రోజుకి కనీసం 113 నిముషాల పాటు టిక్‌టాక్‌ని యూజ్ చేస్తున్నట్టు అంచనా. అయితే...అమెరికాలోనే కొందరు టిక్‌టాక్‌పై మండి పడుతున్నారు. ఆ యాప్‌తో ప్రైవసీకి భంగం కలుగుతోందని మండి పడుతున్నారు.