Shiv Sena symbol row: మా పార్టీ గుర్తుని దొంగిలించారు, విల్లు బాణంతో వస్తే కాగడాలతో బదులిస్తాం - శిందేపై థాక్రే ఆగ్రహం
Uddhav Thackeray: ఉద్దవ్ థాక్రే ఏక్నాథ్ శిందేపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Uddhav Thackeray Fires on Shinde:
శిందేపై ఫైర్..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే...ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిందేపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపైనా విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరుని, గుర్తుని శిందే వర్గానికి ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరుని దొంగిలించారంటూ మండి పడ్డారు.
"మా పార్టీ గుర్తుని దొంగిలించారు. ఆ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలి. ఆ దొంగ ఎవరో అందరికీ తెలుసు. ఇప్పటికే పట్టుబడ్డాడు కూడా. నేనా దొంగకు సవాల్ విసురుతున్నాను. బాణం విల్లుతో వచ్చి ఎదురు నిలబడితే...కాగడాలతో బదులు చెబుతాం. వాళ్లకు కావాల్సింది శివసేన కుటుంబం కాదు. కేవలం బాలాసాహెబ్ థాక్రే పేరు మాత్రమే. ఆ పార్టీ గుర్తు ఉంటే చాలు. ప్రధాని నరేంద్ర మోదీ బాలాసాహెబ్ మాస్క్ వేసుకోవాలని చూస్తున్నారు. మహారాష్ట్రకు రావడానికి అదో మార్గం అని భావిస్తున్నారు. ఏది నిజమైన ముఖమో, ఏది కాదో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు"
-ఉద్దవ్ థాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం
Thieves were given the holy 'bow & arrow', similarly the 'torch' (mashaal) can be taken away. I challenge them - if they're men, come in front us even with the stolen 'bow & arrow', we'll contest election with the 'torch'. This is our test, the battle has begun: Uddhav Thackeray pic.twitter.com/7jocQAEQ1d
— ANI (@ANI) February 18, 2023
I'd like to say that they want the face of Balasahev Thackeray, they want the election symbol but not the family of Shiv Sena. PM Narendra Modi needs the mask of Balasaheb Thackeray to come to Maharashtra. People of the state know which face is real & which isn't:Uddhav Thackeray pic.twitter.com/UXP51HSF2M
— ANI (@ANI) February 18, 2023
శివసేన పార్టీకి చెందిన పేరుని, పార్టీ గుర్తుని ఏక్నాథ్ శిందేకి కేటాయిస్తూ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. దీనిపై తీవ్ర అసహనానికి గురవుతోంది థాక్రే సేన. శిందేపై చాన్నాళ్లుగా పోరాటం చేస్తున్న థాక్రేకు పెద్ద దెబ్బే. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ABP News సోర్సెస్ ద్వారా తెలిసింది. థాక్రే సేనలోని అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికీ ఈ మీటింగ్‌కు రెడీ అయిపోయారు. పార్టీ కార్యాలయమైన మాతోశ్రీలో వీరంతా సమావేశం కానున్నారు. ఏక్నాథ్ శిందే వర్గానికే శివసేన పార్టీ పేరు, ధనుస్సు గుర్తు చెందుతాయని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో చర్చించేందుకే ఎమర్జెన్సీ మీటింగే పెట్టినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. సర్వోన్నత న్యాయస్థానం ఏమీ తేల్చక ముందే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం ఎలా తీసుకుందని వాదిస్తోంది థాక్రే సేన. ఈ విషయంలో ఈసీకి ఎందుకంత తొందర అంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఇప్పటికే థాక్రే వెల్లడించారు.
Also Read: Cheetahs in India: స్పెషల్ ఫ్లైట్‌లో భారత్‌కు మరో 12 చీతాలు, నేరుగా కునో నేషనల్ పార్క్‌కు తరలింపు