By: Ram Manohar | Updated at : 06 May 2023 12:36 PM (IST)
ది కేరళ స్టోరీ సినిమాపై పన్ను ఎత్తివేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
The Kerala Story:
పన్ను లేదు..
The Kerala Story సినిమాపై దేశవ్యాప్తంగా ఎంత రచ్చ జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. కేరళలో పలు చోట్ల ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నాయి ముస్లిం సంఘాలు. అటు తమిళనాడులోనూ దీనిపై పెద్ద గొడవే జరుగుతోంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలని ముస్లిం సంఘాలు కోర్టు వరకూ వెళ్లినా నిరాశే ఎదురైంది. "మేం జోక్యం చేసుకోం" అని కోర్టు తేల్చి చెప్పింది. పొలిటికల్‌గానూ అలజడి రేపింది ఈ సినిమా. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ కావాలనే ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా ట్యాక్స్‌ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఓ వీడియో విడుదల చేసి ఈ విషయం వెల్లడించారు. బీజేపీ సహా మరి కొన్ని హిందూ సంస్థలు కేరళ స్టోరీ సినిమాపై పన్ను వసూలు చేయొద్దని డిమాండ్ చేశాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చౌహాన్...వెంటనే ఈ ప్రకటన చేశారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా వివాదాస్పదమవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించామని మూవీ టీం చెబుతున్నా ముస్లిం సంఘాలు మాత్రం మండి పడుతున్నాయి. మధ్యప్రదేశ్ మంత్రి రాహుల్ కొఠారీ ఇదే విషయమై శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పలుసార్లు మాట్లాడారు. పన్ను ఎత్తివేయాలంటూ లేఖలు రాశారు. ఈ మేరకు చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు.
"ది కేరళ స్టోరీ సినిమా వాస్తవాలను కళ్లకు కట్టింది. ఉగ్రవాదులు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో చూపించింది. అందుకే దీనిపై మా రాష్ట్రంలో ట్యాక్స్ విధించకూడదని నిర్ణయం తీసుకున్నాం"
- శివరాజ్ సింగ్ చౌహన్, మధ్యప్రదేశ్ సీఎం
#WATCH | 'The Kerala Story' movie has been declared tax-free in the state by the government says Madhya Pradesh CM Shivraj Singh Chouhan
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 6, 2023
(Video source: CM Shivraj Singh Chouhan's Twitter handle) pic.twitter.com/V36DpeOD3s
మోదీ కామెంట్స్..
The Kerala Story వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. కర్ణాటకలోని బళ్లారిలో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన...కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఇదే సమయంలో కేరళ స్టోరీ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగానే సినిమాను తెరకెక్కించామని దర్శక నిర్మాతలు చెబుతున్నా కాంగ్రెస్ మాత్రం బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోందని మండి పడ్డారు. ఆ పార్టీ ఉగ్రవాదులకు అండగా నిలబడుతోందని విమర్శించారు.
"నిజ సంఘటనల ఆధారంగానే సినిమా తీశామని దర్శక నిర్మాతలు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ మాత్రం అది ఒప్పుకోవడం లేదు. ఉగ్రవాదుల తరపున నిలబడుతోంది. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదులు కేరళ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తున్నారో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇదే కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టింది. ఎందుకంటే ఆ పార్టీ ఎప్పుడూ ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తుంది. సమాజాన్ని నాశనం చేస్తుంది. టెర్రరిజంతో లింక్‌లు ఉన్న వారితో చేతులు కలుపుతోంది. వాళ్లతో రాజకీయ లావాదేవేలు జరుపుతోంది"
- ప్రధాని నరేంద్ర మోదీ
SCTIMST: తిరువనంతపురం ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో 30 జనరల్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, కొనసాగుతున్న సహాయక చర్యలు- ఎమర్జెన్సీ నెంబర్స్ ఇవే
ABP Desam Top 10, 2 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే
AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?