SC on Kerala Story Ban: బెంగాల్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, కేరళ స్టోరీ సినిమా బ్యాన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
SC on Kerala Story Ban: కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
SC on Kerala Story Ban:
అత్యవసర విచారణ..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. The Kerala Storyపై ఆ ప్రభుత్వం బ్యాన్ విధించడాన్ని తప్పుబట్టింది. ఆ ఆదేశాలపై స్టే విధించింది. ప్రజల అసహనానికి అనుగుణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేమని తేల్చి చెప్పింది. కేరళ హైకోర్టులోనే దీనిపై పిటిషన్ దాఖలైంది. కానీ...ఆ కోర్టు స్టే విధించేందుకు అంగీకరించలేదు. అక్కడి నుంచి పిటిషనర్‌లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం...నిషేధం విధించడానికి వీల్లేదని వెల్లడించింది. జర్నలిస్ట్ కుర్బాన్ అలీ ఈ పిటిషన్ వేశారు. అయితే..దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కపిల్ సిబాల్ కోర్టుకి విన్నవించారు. అప్పటికే హైకోర్టులో కొందరు జడ్జ్‌లు కేరళ స్టోరీ టీజర్‌ని చూశారు. ఆ తరవాతే స్టే విధించేందుకు అంగీకరించలేదు. ఇదొక్కటే కాదు. ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చిన Central Board of Film Certification (CBFC)పైనా వ్యతిరేకంగా పిటిషన్‌లు వేశారు. వీటన్నింటిపైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ముస్లిం ఫ్రెండ్స్ ద్వారా దాదాపు 32 వేల మంది మహిళలు ఐసిస్‌లో చేరారని అవాస్తవాలు చూపించారంటూ ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. మే 3వ తేదీన ఈ పిటిషన్‌లు సుప్రీంకోర్టుకి వెళ్లగా...సర్వోన్నత న్యాయస్థానం విచారణకు అంగీకరించలేదు. హైకోర్టుకే వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అయితే...పిటిషనర్లు రిక్వెస్ట్ చేయడం వల్ల విచారణ చేపట్టింది. చివరకు బెంగాల్ ప్రభుత్వానికే షాక్ ఇచ్చింది. సినిమాని నిషేధించడం సరికాదని వెల్లడించింది. ఇలా చేసుకుంటూ పోతే...ఏదో ఓ కారణం చెప్పి అన్ని సినిమాలనూ బ్యాన్ చేసుకోవాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేసింది.
"సీబీఎఫ్‌సీ కేరళ స్టోరీ సినిమాకు సర్టిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఏమైనా అల్లర్లు జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా అయితే ఏదో ఓ కారణం అడ్డం పెట్టుకుని అన్ని సినిమాలనూ బ్యాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఫిల్మ్ మేకర్స్‌కి కూడా మేం చెప్పేదొకటే. సినిమాకు ముందు ఓ డిస్‌క్లెయిమర్ వేయండి. మీరు చెబుతున్న ఆ 32 వేల సంఖ్య కేవలం ఊహాజనితమని, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక డేటా లేదని చెప్పండి"
- సుప్రీంకోర్టు
Supreme Court stays the May 8 order of the West Bengal government banning the screening of the film ‘The Kerala Story’ in the State. pic.twitter.com/X4evAfOK45
— ANI (@ANI) May 18, 2023
కేరళ స్టోరీ (The Kerala Story) సినిమాను బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేయడంపై సుప్రీంకోర్టు గతంలోనే అసహనం వ్యక్తం చేసింది. బ్యాన్ చేయాల్సిన అవసరమేముందని ప్ర శ్నించింది. ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. బెంగాల్లో సినిమాను బ్యాన్ చేయడాన్ని సవాలు చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం... ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సినిమా ఆడుతున్నప్పుడు బెంగాల్లో మాత్రం ఎందుకు నిషేధించారని ప్రశ్నించింది. తమిళనాడు ప్రభుత్వం నిషేధించకపోయినప్పటికీ...కొన్ని థియేటర్ల ఓనర్లు కావాలనే సినిమాలు ప్రదర్శించకుండా నిలిపివేశారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికీ నోటీసులు అందించింది. ఈ విచారణలో నిర్మాతలూ తమ వాదనలు వినిపించారు.
"మే 5న దేశవ్యాప్తంగా మా సినిమా విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్ వచ్చిన తరవాతే విడుదల చేశాం. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సినిమాను నిషేధించింది. తమిళనాడులోనూ ఆంక్షలు విధించారు"
- కేరళ స్టోరీ సినిమా ప్రొడ్యూసర్
Also Read: పెళ్లి మండపంలోనే విషం తాగిన జంట - వరుడు మృతి, వధువు పరిస్థితి విషమం