Top Headlines Today: ఇడుపులపాయలో జగన్‌తో వైఎస్ విజయమ్మ!- తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్ మాల్
AP Telangana Latest News 27 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: ఇడుపులపాయలో జగన్‌తో వైఎస్ విజయలక్ష్మి - కుమారుడికే మద్దతని పరోక్ష సంకేతాలా ?
వైఎస్ విజయలక్ష్మి రాజకీయంగా తన కుమారుడి వైపే ఉన్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఒక్క సారి కూడా షర్మిలతో కనిపించని విజయమ్మ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా ఇడుపుల పాయలో వైఎస్ సమాధికి నివాళి అర్పించేందుకు జగన్ కలిసి వచ్చారు. ప్రార్థనలు చేశారు. ఈ పరిణామంతో విజయమ్మ కుమారుడు జగన్ వైపే ఉన్నట్లుగా రాజకీయంగా సంకేతాలు వెళ్లినట్లే అనుకోవచ్చు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం క్యూ కడుతున్న నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వచ్చేనెల ప్రకటించనున్నట్టు సమాచారం. సత్యసాయి జిల్లాలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం ఆశవాహులు అధికమయ్యారు. సత్యసాయి జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆశవహులు ఆయా నియోజకవర్గం నుంచి తాము పోటీకి సిద్ధమంటూ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. సత్యసాయి జిల్లావ్యాప్తంగా హిందూపురం అర్బన్, మడకశిర, కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలు సత్యసాయి జిల్లాలోకి వస్తాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్ మాల్ - హరీష్ ఆఫీస్ స్టాఫ్ అరెస్టు
తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతోంది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్‌లో గోల్‌మాల్ జరిగిందని కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నలుగుర్ని అరెస్టు చేశారు. వారిలో హరీష్‌రావు పీఏ నరేష్ ఉన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
దానం నాగేందర్ పార్టీ మారడంపై హైకోర్టులో పిటిషన్- డిస్‌క్వాలిఫై చేయాలని విజ్ఞప్తి
బీఆర్‌ఎస్(BRS) పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్‌పై విజయం సాధించిన దానం నాగేందర్(Danam Nagender) ఈ మధ్య కాలంలో కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. ఖైరతాబాద్ నియోజకవర్గం(Khairatabad Assembly constituency) నుంచి గతేడాది జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, దీప్‌దాస్‌మున్షీ నేతృత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయం చాలా ఆసక్తిగా మారుతోంది. వైసీపీ క్లారిటీతో ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఎవర్ని పక్కన పెట్టాలనే అంచనాలతో ముందుగానే అందరికీ సంకేతాలు ఇచ్చేసింది. అనుకున్నట్టుగానే ఒకేసారి సీట్లు ప్రకటించేసింది. కానీ కూటమిగా ఏర్పాడిన టీడీపీ, జనసేన, బీజేపీలో మాత్రం సీట్లు కేటాయింపు జరిగిందే తప్ప ఇంకా సర్దుబాట్లు మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా కొన్ని సీట్లపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. నేతలు కూడా బహిరంగగానే చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి