Top Headlines Today: సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం! - ప్రచారం ముగియక ముందే ప్రలోభాలు!
AP Telangana Latest News 11 May 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
AP Telangana News Today: ఈ గట్టున రామ్‌చరణ్ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్ ఛేంజర్ ఎవరు?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. క్యాంపెయిన్ లో టాలీవుడ్ ప్రముఖ నటుల ఎంట్రీతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం (Pithapuram) చేరుకున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానులు, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సాయంత్రం తర్వాత మూగబోనున్న మైకులు- 6గంటల వరకే ప్రచారానికి గడువు
తెలుగు రాష్ట్రాల్లో గత రెండు నెల రోజులుగా మారుమోగుతున్న మైకులు మూగబోనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హోరెత్తిన ప్రచారం... ముగింపు దశకు చేరుకుంది. ర్యాలీలు, సభలు, అభిమాన నేతలను కీర్తిస్తూ పాడిన పాటలు, నినాదాలు... సాయంత్రం 6గంటల తర్వాత ఇక వినిపించవు. ఏపీ, తెలంగాణలో... ఎన్నికల ప్రచారానికి ఇవాళే చివరి రోజు కావడం... సాయంత్రం 6గంటల వరకే ప్రచారానికి గడువు ఉండటంతో... రాజకీయ పార్టీల నేతలు చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రచారానికి ఇంకొన్ని గంటలే సమయం ఉండటంతో... ఓటర్ల దగ్గరకు వెళ్లి... తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం: సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం
ఏపీలో ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. ఎవరిని అడిగినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం కష్టమంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉంది. దీంతో ప్రతి ఒక్క ఓటు కీలకంగా మారింది.దీంతో ఊరు విడిచి ఉపాధి కోసం వెళ్లిన వారు వచ్చి ఓటు వేసి వెళ్లాల్సిందిగా అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రానూపోనూ ఛార్జీలతోపాటు మరికొంత సొమ్ము ముట్టచెబుతున్నాయి. హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bangalore), చెన్నై(Chennai) నుంచి ప్రత్యేక బస్సులు, వాహనాలు సమకూర్చాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ప్రచారం ముగియక ముందే ప్రలోభాలు- అంతా ఆన్‌లైన్‌లోనే
ప్రచారం ముగియనుంది ప్రలోభాలకు తెరలేవంనుంది. ఇప్పటికే భారీగా నగదు తనిఖీల్లో చిక్కుతోంది. ఓటర్ల పంచేందుకు పార్టీలు పెద్ద ఎత్తున నగదు రవాణా చేస్తున్నారు. మూడో కంటికి తెలియకుండా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా ప్రాంతాల్లో డబ్బు, ఇతర పంపిణీ సామాగ్రి చిక్కుతోంది. మరి కొన్ని పార్టీలు ఆన్‌లైన్‌లో డబ్బులు చేరవేస్తోందని ఇంకొన్ని ప్రాంతాల్లో కోడ్ రూపంలో చూపిస్తే కావాల్సిన ఇంటి సరకులు పంపిణీ చేస్తోందనే ప్రచారం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పాకిస్తాన్ తో పోల్చి భారత్ ను అవమానించొద్దు..!
15సెనక్లు టైమ్ ఇస్తే ఒవైసీ కుటుంబం ఓల్డ్ సిటీలో లేకుండా చేస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఏబీపీ దేశానికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి