అన్వేషించండి

Ram Charan: ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?

Andhra Pradesh News: ఏపీ ఎన్నికల వేళ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఓ వైపు పిఠాపురంలో రామ్ చరణ్ పర్యటిస్తుండగా.. అల్లు అర్జున్ నంద్యాలలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి వెళ్లారు.

Mega Family In Ap Election Campaign: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. క్యాంపెయిన్ లో టాలీవుడ్ ప్రముఖ నటుల ఎంట్రీతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం (Pithapuram) చేరుకున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానులు, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుతుండగా.. రామ్ చరణ్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే, కుక్కుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం చరణ్.. బాబాయ్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. 

వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా అల్లు అర్జున్

మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాలలో (Nandyal) శనివారం సందడి చేశారు. ఈ క్రమంలో ఆయన్ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎటు చూసిన జనసంద్రంగా మారింది. అల్లు అర్జున్ కు గజమాలతో ఘనంగా సత్కరించారు. అభిమానుల కోలాహలం మధ్య ఆయన తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి శిల్పా దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిల్పా రవి ఇంటి బాల్కనీ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కాగా, గత ఎన్నికల్లో తొలిసారి నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. అప్పుడు బన్నీ తన మిత్రుడికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు కూడా ఎన్నికల టైంలో తన మిత్రుడి ఇంటికి వచ్చి సందడి చేశారు. శిల్వా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని ఫ్యాన్స్ కు చూపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఐకాన్ స్టార్ ఫ్యాన్స్, వైసీపీ శ్రేణులు వాటిని షేర్ చేస్తున్నారు. నంద్యాల వైసీపీ అభిమానులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. 

అయితే, ఓ వైపు కోనసీమలో రామ్ చరణ్, మరోవైపు రాయలసీమ ప్రాంతంలో అల్లు అర్జున్ ఎన్నికల టైంలో పర్యటించడం అంతటా ఆసక్తిగా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ తరఫున ప్రచారం నిర్వహిస్తారనే ప్రచారం సాగుతుండగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి అతని చేతిని పట్టుకుని అభిమానులకు అభివాదం చేయడం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Also Read: Special Trains: హైదరాబాద్‌ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్‌ కన్ఫామ్ అయ్యే ఛాన్స్‌

టాప్ హెడ్ లైన్స్

CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget