అన్వేషించండి

AP Assembly Elections: సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం: సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం

AP Voting: ఏపీలో ఎన్నికలను రాజాకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ప్రతి ఒక్క ఓటు కీలకంగా మారడంతో ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి

AP Elections: ఏపీలో ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. ఎవరిని అడిగినా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పడం కష్టమంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉంది. దీంతో ప్రతి ఒక్క ఓటు కీలకంగా మారింది.దీంతో ఊరు విడిచి ఉపాధి కోసం వెళ్లిన వారు వచ్చి ఓటు వేసి వెళ్లాల్సిందిగా అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రానూపోనూ ఛార్జీలతోపాటు మరికొంత సొమ్ము ముట్టచెబుతున్నాయి. హైదరాబాద్(Hyderabad), బెంగళూరు(Bangalore), చెన్నై(Chennai) నుంచి ప్రత్యేక బస్సులు, వాహనాలు సమకూర్చాయి. శుక్రవారం రండి...సోమవారం తిరిగి వెళ్లండి నినాదాన్ని తీసుకొచ్చాయి. పోలింగ్ బూత్‌లో వచ్చిన మెజార్టీ ఆధారంగానే ఈసారి పదవులుంటాయన్న సమాచారంతో దిగువస్థాయి నేతలు పోలింగ్ పెంచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు....

సొంతఊర్లకు పయనం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడటంతో...వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు రాజకీయపార్టీలు తంటాలుపడుతున్నాయి. ప్రతి ఒక్క ఓటు కీలకంగా మారింది. గెలుపోటములు నువ్వా-నేనా అన్నట్లు ఉండటం...చాలాచోట్ల మెజార్టీ కేవలం వందల్లోనే ఉంటుందన్న సమాచారంతో అభ్యర్థులు ఏమాత్రం రిస్క్‌ తీసుకోవడం లేదు. ఎంత ఖర్చయినా పర్వాలేదు...వచ్చి ఓటువేసి వెళ్లండి మేం చూసుకుంటామంటూ భరోసా ఇస్తున్నారు. దీంతో మహానగరాలు ఖాళీ అయిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో దాదాపు శుక్రవారమే జనం ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. శని, ఆదివారాల్లోనూ బస్టాండ్లు(Busstand), రైల్వేస్టేషన్లు(Railway Station) కిటకిటలాడిపోనున్నాయి. ఇప్పటికే దూరప్రాంతాల టిక్కెట్లన్నీ ముందుగానే రిజర్వేషన్లు అయిపోయాయి.

కూటమి విస్తృత ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఓటింగ్‌శాతం ఎంత పెరిగితే NDA కూటమికి అంత ప్రయోజనం ఉండే అవకాశం ఉండటంతో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆ పార్టీ అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో(Social Media) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం బయలుదేరి రండి....సొంత ఊరిలో సోమవారం ఓటేయండి క్యాంపెయిన్ నడుస్తోంది. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు వెళ్దాం...మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అలాగే, చెన్నై, బెంగళూరు, ముంబయిలోనూ వివిధ రకాల పోస్టులతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎండల్లో ఇంత కష్టపడి ఏం వెళ్తాంలే అనుకుంటున్న బద్ధకస్తులు కూడా ఈ స్లోగన్లు, ప్రచారం చూసి మనసు మార్చుకుంటున్నారు.

ప్రతిఒక్కరినీ ఆలోచింపచేసే విధంగా సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతిఒక్కరూ వాటిని చూడటమే గాక...వారి ఖాతాల్లో షేర్‌ చేస్తూ మరికొంతమందిని ఓట్లు వేసేలా పురిగొల్పుతున్నారు. చివరి నిమిషంలో మానుసు మార్చుకుని ఓటు వేసేందుకు బయలుదేరుతున్న వారికోసం రాజకీయపార్టీలు(Political Party) అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. వివిధ నగరాల నుంచి సొంత ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. పార్టీ సోషల్‌మీడియా ఖాతాల్లో ఫోన్‌నెంబర్లు పెట్టి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాయి. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో 10 రోజుల ముందు నుంచే ఓటర్ల వివరాలు సేకరించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. సొంతంగా వచ్చే వారికి దారి ఖర్చులు ఇస్తున్నారు. మరికొందరు స్వచ్ఛంధంగానే  ఓటు వేసేందుకు బయలుదేరారు. సొంత గ్రామాలకు వెళ్తున్న వాహనాలతో రహదారులపైనా, టోల్‌గేట్లు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఏదీఏమైనా ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
BMW Bikes Price Hike: జనవరి నుంచి భారీగా పెరగనున్న బైక్ ధరలు - బీఎండబ్ల్యూ క్రేజీ డెసిషన్!
జనవరి నుంచి భారీగా పెరగనున్న బైక్ ధరలు - బీఎండబ్ల్యూ క్రేజీ డెసిషన్!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
BMW Bikes Price Hike: జనవరి నుంచి భారీగా పెరగనున్న బైక్ ధరలు - బీఎండబ్ల్యూ క్రేజీ డెసిషన్!
జనవరి నుంచి భారీగా పెరగనున్న బైక్ ధరలు - బీఎండబ్ల్యూ క్రేజీ డెసిషన్!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
District App: ‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
RS Praveen: అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
Embed widget