Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో అందాల భామల టాలెంట్ చూడాలనుకుంటున్నారా ? - ఇదిగో ఫ్రీ ఎంట్రీ మార్గం
Telangana : హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి. చూసేందుకు సామాన్యులకూ అవకాశం కల్పిస్తున్నారు.

Miss World 2025 Free Entry Tickets: హైదరాబాద్‌లో ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల సందడి కనిపిస్తోంది. అయితే ఇది హైక్లాస్ ప్రజల కోసమేనని సామాన్యులు చూసేందుకు అవకాశం లేదని జరుగుతున్న ప్రచారంతో.. తెలంగాణ ప్‌రభుత్వం సామాన్యులకూ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల్లో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఎంట్రీ టిక్కెట్లను పంపిణీ చేయడానికి అధికారిక ఆన్‌లైన్ పోటీని ప్రారంభించింది.
అందం, ప్రతిభ , సాంస్కృతిక వైవిధ్ ఉండే ఈ వేడుకకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న వారు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ పత్రాన్ని పూరించడం ద్వారా లాటరీలో పాల్గొనే అవకాశం అందుకుంటుంది.
ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వ్యక్తులకు కన్ఫర్మేషన్ ఇ మెయిల్ వస్తుంది. ఇది వారి ఉచిత ఎంట్రీ టిక్కెట్లను సేకరించడానికి చెల్లుబాటు అయ్యే రుజువుగా పనిచేస్తుంది. పాస్‌లు మే 8, 2025 నుండి గచ్చిబౌలి స్టేడియంలోని బాక్స్ ఆఫీస్ వద్ద అందుబాటులో ఉంటాయి. మిస్ వరల్డ్ ఈవెంట్‌కు ప్రధాన వేదికగా గచ్చిబౌలి స్టేడియం ఉంది. ఆసక్తిగల పౌరులు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని టూరిజం అధికారులు ప్రకటించారు. .
మిస్ వరల్డ్ 2025: ఉచిత టిక్కెట్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ?
tourism.telangana.gov.in వెబ్ సైట్‌కు వెళ్లాలి.
"మిస్ వరల్డ్" విభాగంపై క్లిక్ చేయాలి
ఫారమ్‌ను పూర్తి చేయాలి. తర్వాత Google ఫారమ్ ద్వారా క్విజ్ పూర్తి చేయాలి
పూర్తిచేసిన తర్వాత కన్ఫర్మేషన మెయిల్ వస్తుంది!
Get Complimentary Passes for #MissWorld2025 Events
— Informed Alerts (@InformedAlerts) May 6, 2025
Register online at Telangana Tourism for a chance to win complimentary passes to Miss World events. Passes can be collected at Gachibowli Stadium from 8th May 2025. pic.twitter.com/hEenQcOwUt
ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరు కాలేని వారి కోసం, మిస్ వరల్డ్ 2025 పోటీ www.youtube.com/@missworld లోని అధికారిక మిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. రెగ్యులర్ రియల్-టైమ్ అప్‌డేట్‌లు అధికారిక మిస్ వరల్డ్ వెబ్‌సైట్ www.missworld.com లో కూడా అందుబాటులో ఉంటాయి.
మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం అందాల భాములు హైదరాబాద్ చేరుకుంటున్నారు.
With each new arrival, Telangana lights up! Miss World contestants are being welcomed with warmth & culture, and the buzz is real. The people of Telangana are meeting the world—one smile at a time!@telanganacmo#TelanganaZarurAana #72ndMissWorld #GlobalFriendship #missworld pic.twitter.com/vQ8fu9eMlh
— Telangana Tourism (@TravelTelangana) May 7, 2025





















