ISRO Live Updates: గతి తప్పిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్.. కారణం ఏంటంటే..
Background
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం తెల్లవారు జామున జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్-ఎఫ్10 (జీఎస్ఎల్‌వీ-ఎఫ్10) ప్రయోగం చేపట్టింది. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ రాకెట్ కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 పొగలు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఒకటి రెండు దశలు సాఫీగానే సాగగా.. మూడో దశలో రాకెట్ గమనం గతి తప్పినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
GSLV-F10 lifts off successfully from Satish Dhawan Space Centre, Sriharikota#GSLV-F10 #EOS03 #ISRO pic.twitter.com/iXZfHd7YdZ
— ISRO (@isro) August 12, 2021
ఈ ప్రయోగం మళ్లీ చేపడతాం: కేంద్ర మంత్రి
జీఎస్ఎల్‌వీ-ఎఫ్10 ప్రయోగం విఫలం కావడంపై తాను ఇస్రో ఛైర్మన్ శివన్‌తో మాట్లాడినట్లు స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని మళ్లీ నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
Spoke to Chairman #ISRO, Dr K.Sivan and discussed in detail. The first two stages went off fine, only after that there was a difficulty in cryogenic upper stage ignition. The mission can be re-scheduled some time again. https://t.co/U5C0wTEHHv
— Dr Jitendra Singh (@DrJitendraSingh) August 12, 2021
రాకెట్ గమనం సాగింది ఇలా..
జీఎస్ఎల్‌వీ ప్రయోగం మొత్తాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ వీడియోను ట్విటర్‌లో ఉంచారు. మొదటి, రెండో దశలు సాధారణంగా అనుకున్న ప్రకారమే సాగగా.. మూడో దశలో సమస్య తలెత్తింది. నింగిలోకి దూసుకెళ్లిన మూడు నిమిషాలకు కూడా రాకెట్ పనీతీరు సవ్యంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాకెట్ ముందు భాగంలో ఉండే మొనదేలిన భాగాలు వేరుకావడం కూడా బాగానే జరిగింది. క్రయోజెనిక్ దశలో రాకెట్ గమనం మారింది. దీంతో చర్చల అనంతరం ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.
Watch Live: Launch of EOS-03 onboard GSLV-F10 https://t.co/NE3rVjNtHb
— ISRO (@isro) August 11, 2021





















