Breaking News: సెప్టెంబర్ 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
సెప్టెంబర్ 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చ
తెలంగాణ కేబినెట్ సెప్టెంబర్ 16న సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు, నిర్వహణపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 25లోగా ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. ముఖ్యంగా దళిత బందు పథకంపై చర్చ జరగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంటల సాగు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లాంటి అంశాలపై, ఉద్యోగాల భర్తీ అంశంపై సైతం రాష్ట్ర మంత్రి మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సైదాబాద్ సింగరేణి కాలనీ.. చిన్నారి హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్ ప్రకటన
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార నిందితుడిపై రూ.10 లక్షల రివార్డ్ ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ అందిస్తామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. పోలీసులు నిందితుడి ఆనవాళ్లను విడుదల చేశారు.
టీటీడీ పాలక మండలి ఖరారు.. తెలంగాణ నుంచి అయిదుగురికి చోటు..
టీటీడీ కొత్త పాలక మండలి ఖరారైంది. మొత్తం 25 మంది సభ్యులలో తెలంగాణ నుంచి ఐదుగురు, తమిళనాడు నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సేవాభావం కలిగిన మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.
సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల
హీరో సాయి ధరమ్ తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. కాలర్ బోన్ సర్జరీ చేసిన వైద్యులు ఆయనను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. తాజాగా అపోలో ఆసుపత్రి వర్గాలు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. చికిత్సలో భాగంగా వెంటిలేటర్ అవసరాన్ని తగ్గిస్తున్నామన్నారు. బయోమెడికల్ పరీక్షలు సంతృప్తికరంగా ఉన్నాయన్న వైద్యులు... ప్రత్యేక వైద్యుల బృందం అబ్జర్వేషన్‌లో ఉన్నారని తెలిపారు.
జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలి: రఘురామ
హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్నారు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపంది.