Sunburn Festival Controversy : సన్‌బర్న్ ఫెస్టివల్‌పై సీఎం రేవంత్‌కు ఎందుకంత అయిష్టత ? డ్రగ్స్ పార్టీగా భావిస్తున్నారా ?
Sun Burn Festival : సన్ బర్న్ ఫెస్టివల్‌కు అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ నిరాకరించింది. ఇందులో డ్రగ్స్ వాడతారన్న ఆరోపణలు ఉండటమే కారణం.
Sunburn Festival Controversy Telangana : సన్ బర్న్ ఫెస్టివల్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎలాంటి అనుమతులు పోలీసులు మంజూరు చేయలేదు. అయినా టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు సన్ బర్న్ ఫెస్టివల్ అంటే ఏమిటి.. ఎందుకు రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పారు.
ఇంటర్నేషనల్ ఈవెంట్ సన్ బర్న్ ఫెస్టివల్
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31న సన్ బర్న్ పేరుతో ఫెస్టివల్ ఈవెంట్లను నిర్వహిస్తూంటారు. వివిధ దేశాల్లో ఈ సన్ బర్న్ ఈవెంట్స్ జరుగుతాయి. ఈ ఫెస్టివల్స్‌లో డ్రగ్స్ వాడతారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే బాగా డబ్బున్న యువత .. విందులు, వినోదాలపై ఆసక్తి ఉండే జనం మాత్రం ఎంత ఖర్చు అయినా సన్ బర్న్ ఫెస్టివల్‌కు వస్తూంటారు. అందుకే దీనికి మంచి ఆదరణ ఉంది.
లోక్‌సభ ఎన్నికలకు 90 రోజల ప్లాన్ - తెలంగాణ బీజేపీకి అమిత్ షా రోడ్ మ్యాప్ !
అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహణకు ఏర్పాట్లు
హైదరాబాద్ 2024 కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లోని మాదాపూర్‌లో డిసెంబరు 31 రాత్రి ఎనిమిది గంటలకు సన్ బర్న్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బుక్ మై షోలో ప్లాట్ ఫాంలో టికెట్ల విక్రయం కూడా మొదలయింది. డ్రగ్స్ ఉండవని.. ప్రభుత్వ నియమాల ప్రకారమే మద్యం అందిస్తామని కూడా నిర్వాహకులు చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నా అనుమతులు తీసుకోలేదు. దీంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి కేసులు పెట్టారు. చివరికి టిక్కెట్ల అమ్మకం నిలిపివేశారు. ఈవెంట్ నిలిపివేయడం ఖాయమింది.
సన్‌బర్న్ విశృంఖల వినోదాల పార్టీ అని వివాదాలు - పలు చోట్ల నిషేధం
గోవాలో ఈ ఏడాది 31వ తేదీన సన్ బర్న్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు. ఈ ఫెస్టివల్ని డ్రగ్స్ భారీగా విక్రయించే హబ్ గా వాడుకుంటుకొన్నట్లు చాలా విమర్శలు ఉన్నాయి. అందుకే గతంలో కొంత మంది న్యాయపోరాటం కూడా చేశారు. వేడుకు నిర్వహించుకోవడానికి స్వర్గధామం లాంటి గోవాలోనే ఇలాంటి విచ్చలవిడి పార్టీలపై 2022లో ఈ ఫెస్టివల్ వివాదం హైకోర్టు దాకా వెళ్లింది. అపుడు బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ చాలా స్పష్టంగా 2022 లో సన్ బర్న్ కు ఇచ్చిన అనుమతులు చట్ట వ్యతిరేకమని కోర్టు పేర్కొంది. నిజానికి గోవా ప్రభుత్వం ఈ ఏఅడాది కూడా అనుమతి ఇచ్చింది. ప్రజలు, వ్యాపారాస్థులు, నార్త్ గోవాలోని గ్రామాల ప్రజలు అందోళన చేశారు. ఈ ఫెస్టివల్ నిర్వహిస్తే ఆశ్లీల సంస్కృతికి యువతీ యువకులు బలవుతారని విమర్శ వచ్చింది. దీనితో ముఖ్యమంత్రి ప్రమోద సావంత్ డిసెంబర్ 31 న నిర్వహించేందుకు అనుమతి నిరాకరించినట్లుగా ప్రకటించారు.
ఫుడ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన అపోహలు ఇవే.. మీరు కూడా ఫాలో అయ్యారా?
కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌కు సన్ బర్న్ ఫెస్టివల్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సన్ బర్న్ ఫెస్టివల్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో నాటి ఐటి మంత్రి కెటి రామారావు కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ అంతర్జాతీయ లీజర్ డెస్టినేషన్ కావాలంటే సన్ బర్న్ వంటి ఫెస్టివల్స్ అవసరమని ఆయన చెప్పేవారు. 2014లోనే హైదరాబాద్ లో తొలి సన్ బర్న్ ఫెస్టివల్ జరిగింది. అప్పటి నుంచి జరుగుతూనే వస్తున్నది. అయితే జరిగినప్పుడల్లా రాజకీయ వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.
As promised @SunburnFestival will be in Hyderabad on Nov 22nd at Emaar Boulder Hills. All the music lovers & @djafrojack fans, have a blast!
— KTR (@KTRBRS) November 16, 2014
కేటీఆర్ బంధువులు నిర్వహణలో భాగం పంచుకుంటున్నారా ?
నిర్వహించేది సన్ బర్న్ సంస్థ అయినా హైదరాబాద్ లో ఫ్రాంచైజీ తీసుకుని నిర్వహించేది కేటీఆర్ బంధువులేనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున గతంలో తాము విమర్శించిన ఫెస్టివల్స్ ను ఇప్పుడు అనుమతించడం ఎందుకని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ మీద యుద్దం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ లో ఇకపై ఇలాంటి వాటికి అనుమతి లేదంటూ చాలా స్పష్టంగా ప్రకటించారు.