Telangana BJP : లోక్‌సభ ఎన్నికలకు 90 రోజల ప్లాన్ - తెలంగాణ బీజేపీకి అమిత్ షా రోడ్ మ్యాప్ !
Kishan Reddy : తెలంగాణలో బీజేపీ పదికిపైగా లోక్ సభ సీట్లను సాధిస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులకు 28న అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
Telangana BJP Lok Sabha strategy : తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 28న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. నాంపల్లిలో బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల కోసం 90 రోజుల ప్లాన్
అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన పలితాలు రాకపోయినా ఓట్ల శాతం పెరిగిందన్నారు. సీట్లు పెరిగాయన్నారు. 28వ తేదీ సమావేశానికి అమిత్ షా వస్తున్నారని ప్రకటించారు. మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలు ఈమీటింగ్ కు హాజరు అవుతారన్నారు. 90 రోజుల ఆక్షన్ ప్లాన్ ఉందని అన్నారు. తెలంగాణలోని అన్నివర్గాల్లో బీజేపీకి, మోడీకి సానుకూల చర్చ జరుగుతుందన్నారు. ఎన్నికల కోసం మోడీకి ఓటు వేయడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అద్భుత మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని అన్నారు.
జనవరి మొదటి వారంలో కాంగ్రెస్‌లోకి షర్మిల- ఏపీ ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం!
తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు ఖాయం
తెలంగాణలో బీజేపీకి డబల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2019తో పోలిస్తే తేడా ఉంది తెలంగాణలోని ప్రతి ఇంట్లో మోడీ చర్చ జరుగుతుందని అన్నారు. శాసన సభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామన్నారు. జనవరి నెలలో పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెడతామన్నారు. యువత బీజేపీ వైపు ఉందన్నారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగస్వామ్యం కావాలని నిర్ణయించిందని కిషన్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్ - మరి కలుస్తాయా ?
లోక్‌సభ ఎన్నికల వ్యూహం ఖరారుకు తెలంగాణకు అమిత్ షా
లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు 28వ తేదీన కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు 1200 మందితో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే రోజు అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను నిర్ణయించనున్నారు.తెలంగాణా రాష్ట్రంలో పది పార్లమెంట్ సీట్లు గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఇదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.