Breaking News Live: ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పిల్లిమొగ్గలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
![Breaking News Live: ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పిల్లిమొగ్గలు Breaking News Live: ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పిల్లిమొగ్గలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/12/cd413008be0e70ada6bfbef69af26473_original.jpg)
Background
నకిలీ డిగ్రీ డాక్యుమెంట్లు తో పదోన్నతి పొందారని ఆరోపణ పై సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అశోక్ బాబుకు శుక్రవారం రాత్రి బెయిల్ మంజూరైంది. శుక్రవారం రాత్రి 12.20 గంటల ప్రాంతంలో అశోక్ బాబు విడుదల య్యారు. ఓ వివాహ వేడుకకు హాజరై గురువారం రాత్రి 11.30కు ఇంటికి చేరుకున్న అశోక్ బాబును మఫ్టీలో వేచి చూస్తున్న పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తీసుకెళ్లారు. శుక్ర వారం రాత్రి 7 గంటల వరకు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సీఐడీ కోర్టుకు తరలిం చారు. సుదీర్ఘ విచారణల అనంతరం ఆయనకు 20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ లభించింది. దాదాపు 18 గంటల అనంతరం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి జస్టిస్ సత్యవతి అశోక్ బాబుకు బెయిల్ మంజూరు చేశారు.
కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చలి ప్రభావం తగ్గతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, చలి తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. జంగమేశ్వరపురంలో అత్యల్పంగా 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల తగ్గాయి.
తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలు, వాటి చుట్టుపక్కల జిల్లాలో పలు చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.250 మేర పుంజుకోగా తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,800 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,970 అయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర పెరిగింది. ఫిబ్రవరి నెలలో గరిష్టానికి ఎగబాకింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,900 కు చేరింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారంపై రూ.280 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,970 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,800కి ఎగబాకింది. వెండి 1 కేజీ ధర రూ.66,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 అయింది.
హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 10 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.84 కాగా, 21 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.28 కి చేరింది. కరీంనగర్ లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 60 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.107.92 కు దిగిరాగా.. 56 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.35 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 20 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.65 కాగా, ఇక్కడ డీజిల్ పై 18 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.69 అయింది. విశాఖపట్నంలో 60 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.05 అయింది. డీజిల్‌పై 56 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.95.18 కు దిగొచ్చింది.
Special Status : ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పిల్లిమొగ్గలు
ప్రత్యేక హోదాపై కేంద్ర పిల్లిమొగ్గలు వేస్తోంది. విభజన సమస్యలపై చర్చించేందుకు 17వ తేదీని ఇరు రాష్ట్రాల సీఎస్‌లను పిలించిన కేంద్రం.. అజెండాలో ప్రత్యేకహాదాను పెట్టింది. సాయంత్రానికి దాన్ని మార్చి మరో అజెండా కాపీని విడుదల చేసింది. అందులో ప్రత్యేకహోదా అంశాన్ని తొలిగించింది. ఉదయం విడుదల చేసిన అజెండాపై బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ ప్రత్యేక హోదా అంశం చర్చల్లో లేదని చెప్పారు. దీనిపై అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీపై, అధికారులపై మండిపడ్డారు. ఈయన ప్రెస్‌మీట్ పెట్టిన కాసేపటికే కొత్త అజెండా కాపీని కేంద్రం విడుదల చేసింది. అందులో ప్రత్యేక హోదా అంసాన్ని తీసేసింది.
రాహుల్ బజాజ్ మృతి పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ సంతాపం
ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ శనివారం పూణెలో మృతి చెందడం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు రాహుల్ బజాజ్ దేశంలో ఆటోమొబైల్ రంగం ఉన్నతికి దోహదపడ్డారన్నారు. బజాజ్ స్కూటర్ ను ఆవిష్కరించి దేశంలోని ప్రతి ఇంటికి దానిని చేరువ చేశారన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Fire Accident In Punjagutta: ట్రాఫిక్ కానిస్టేబుల్ సాహసం, తల్లీకూతురు క్షేమం
పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు ఎగసిపడ్డాయి. మంటలు రావడంతో ఏమి చేయలేక రూమ్ లోనే చిక్కుకున్న తల్లి కూతురు.
నాల్గో అంతస్తులో తల్లి కూతురు ఉన్నారని పోలీసులకు తెలియడంతో అప్రమత్తం. తన ప్రాణాలు లెక్క చేయకుండా టెర్రాస్ నుంచి కిందికి దూకి తల్లి కూతురుని కాపాడిన పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్
Bajaj Group Chairman Passes Away: బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూత
బజాజ్ గ్రూప్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ చాలా కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. రాహుల్ బజాజ్ మరణం పట్లన తాము విచారణం చేస్తున్నామంటూ బజాబ్ గ్రూప్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ఆయన ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం కన్నుమూశారని ప్రకటనలో పేర్కొన్నారు. అతని నాయకత్వంలో బజాజ్ ఆటో టర్నోవర్ 7.2 కోట్ల నుంచి 12 వేల కోట్లకు చేరుకుంది. దేశంలోనే ప్రముఖ స్కూటర్, ద్విచక్ర వాహనాల విక్రయ సంస్థగా అవతరించింది.
Gutka Seize: రూ. 15లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం, ఇద్దరు నిందితులు అరెస్టు
కర్ణాటక నుంచి వరంగల్‌కు నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కోట శ్రీనివాస్, సతీష్ ను ఎల్.బి నగర్ ఎస్.ఓ.టి, ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గుట్కా తరలిస్తూ కోట శ్రీనివాస్‌పై కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు . టాటా సఫారీలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా టోల్ గేట్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు రక్షిత మూర్తి తెలిపారు. నిందితుల వద్ద నుంచి 15లక్షలు విలువ చేసే గుట్కా, టాటా సఫారీ వాహనం, 3 మొబైల్ ఫోన్స్, 7వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గుట్కా ఉత్పత్తి, అమ్మకాలను ప్రభుత్వం నిషేధించిందని, గుట్కా అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజిగిరి డిసిపి రక్షిత మూర్తి హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)