(Source: ECI/ABP News/ABP Majha)
Top Headlines Today: వైసీపీపై అణుబాంబు వేసేందుకు టీడీపీ రెడీ! కేటీఆర్, బండి సంజయ్ మధ్య వార్ - నేటి టాప్ న్యూస్
Telangana News Updates : ఏపీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ నడుస్తోంది. అటు వైసీపీ పై పెద్ద బాంబ్ వేసేందుకు అధికార టీడీపీ సిద్ధంగా ఉంది.
Andhra Pradesh News in Telugu | వారంలో క్షమాపణలు చెప్పండి- చెప్పను ఏం చేసుకుంటారో చేసుకోండి; కేటీఆర్, బండి సంజయ్ మధ్య వార్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో లీడర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపించారు. వారం రోజుల్లోపు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మధ్య కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాలో మాట్లాడుతూ కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
షర్మిల, విజయమ్మపై జగన్ న్యాయపోరాటం- సరస్వతిలో వాటాలు ఇవ్వడం లేదని పిటిషన్
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్నది రాజకీయ జగడం కాదని... ఆస్తుల పంచాయితీ అనే విషయం తాజాగా వెలుగు చూస్తోంది. గతంలో చెల్లెలకు తన కంపెనీల్లో వాటా ఇచ్చేందుకు అంగీకరించిన జగన్.... తర్వాత నో చెబుతున్నారు. ఇదే విషయంపై ఇప్పుడు న్యాయపోరాటానికి సైతం దిగారు. దీనికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వైఎస్ కుటుంబంలో చెలరేగిన ఆస్తుల వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా దీపాదాస్ మున్షి - సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారన్న ఆరోపణలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్రంలోనే మకాం వేసినా ఆ పార్టీ వ్యవహారాలు రోడ్డున పడుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీపై తిరుగుబాటు చేసినంత పని చేస్తున్నారు. వారితో మాట్లాడేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. పార్టీలో చేరిన వారూ అసంతృప్తిలో ఉన్నారు. మరో వైపు పార్టీ వ్యవహారాలను చక్క బెట్టాల్సిన పార్టీ ఇంచార్జ్ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
హత్యకు గురైన యువతి ఫ్యామిలీకి జగన్ సాయం- ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్
గుంటూరు జీజీహెచ్‌లో సహానా కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బాధిత కుటుంబానికి వైసీపీ తరఫున పది లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలకు సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పెద్ద స్కెచ్చే వేస్తున్న టీడీపీ - వైసీపీపై అణుబాంబు ఖాయం - ఇంతకీ ఏమిటది ?
తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఓ పెద్ద విషయాన్ని బయట పెట్టబోతున్నామని ప్రకటించారు. ఏదైనా పరిశ్రమ లేదా ప్రాజెక్టు గురించి ప్రకటన అయితే పార్టీ పరంగా ప్రకటన చేయరు. కానీ రాజకీయ పరమైన ప్రకటన అదీ కూడా.. బిగ్ ఎక్స్‌పోజ్ అని ప్రకటించారు. పూర్తి వివరాలు