(Source: ECI/ABP News/ABP Majha)
Salary : దేశంలో అత్యధిక జీతభత్యాలు రూ.135 కోట్లు - తీసుకుంటున్నది ఈయనే !
Highest Salary : కార్పొరేట్ కంపెనీల్లో ప్రతిభకు తగ్గట్లే జీతాలిస్తారు. అలాగే పొజిషన్ ను బట్టి కూడా. ఇలా ప్రతిభ, పొజిషన్ కలిసి రూ.135 కోట్ల మేర జీతం అందుకుంటున్నారు ఓ సీఈవో.
Tata Group Chairman draws the highest package in India Rs 135 cr : శాలరీ ఎంత అంటే.. సీటీసీతో పొంతలేనంత అని చెప్పే నిరాశా జీవులు ఉంటారు. కానీ కొంత మందికి ఊహించనంత మొత్తం శాలరీ, భత్యాలు లభిస్తూ ఉంటాయి. అయితే వారికి నిజంగా తమ జీతం ఎంత వస్తుంది అని లెక్కేసుకునేంత తీరిక ఉండదు. అంత కీలక బాధ్యతల్లో ఉంటారు.
టాటా సన్స్ చైర్మన్ కు అత్యధిక జీతం
2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా జీతం అందుకున్నది ఎన్ చంద్రశేఖరన్. ఈయన ఎవరో కాదు.. టాటా సన్స్ గ్రూప్ మొత్తానికి సీఈవో. సైరస్ మిస్త్రిని తప్పించిన తర్వాత ఎన్ చంద్రశేఖరన్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్నుంచి గ్రూపు కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కాలంగా నష్టాల్లో ఉన్న యూనిట్లుకూడా లాభాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ చంద్రశేఖర్ జీతభత్యాలు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయనకు జీతభత్యాల కింద రూ. 135 కోట్లు లభిస్తున్నాయి. ఇందులో 122 కోట్ల రూపాయలు ప్రాఫిట్ లింక్డ్ కమిషన్, మిగతా మొత్తం మామూలు జీత భత్యాలు.
కోల్‌కతా డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాదు - సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన సీబీఐ ?
దేశంలో అత్యధిక శాలరీ టాటా గ్రూపు చైర్మన్ కే
ఇప్పటి వరకూ ఏ కంపెనీ చైర్మన్ లేదా ఎండీ ఈ స్థాయిలో జీతాలు తీసుకోలేదు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ జీతభత్యాలు వదులుకుంటున్నారు. లేకపోతే ఆయనే మొదటి స్థానంలో ఉండేవారని అనుకోవచ్చు. విప్రో మాజీ సీఈవో కంపెనీలో తాను రాజీనామా చేసిన ఏడాదిలో ధియర్రీ డెలాపోర్టె రూ. 167 కోట్లు పొందారు. కానీ అందులో అత్యధికంగా ఆయనకు పరిహారంగా ఇచ్చిందే. చంద్రశేఖర్ టాటా సన్స్ గ్రూపు డైరక్టర్ల బోర్డు మీటింగ్‌లో పాల్గొన్నందుకు మరో పదిహేడు లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. చంద్రశేఖరన్ కు టాటా గ్రూపులో రూ. 168 కోట్ల రూపాయల విలువైన షేర్లు కూడా ఉన్నాయి.
వరద నీళ్లలో కారు మునిగితే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది? ఎలా క్లెయిమ్ చేయాలి?
కార్పొరేట్ కంపెనీల చైర్మన్లకు భారీ వేతనాలు
టాటా సన్స్ సీఎఫ్‌వోకు రూ. 30 కోట్ల జీతం అందుతోంది. చంద్రశేఖరన్ తర్వాత టాటాగ్రూపులో ఆయనకే అత్యధికం. టాటా గ్రూపులోని ఇతర కంపెనీల సీఈవోలకు కూడా అంత జీతం లేదు. అయితే వీరు ఎంత జీతాలు తీసుకున్నా.. అవి బ్యాంకులో పడ్డాయో లేదో చెక్ చేసుకునేంత తీరిక కూడా ఉండదు. ఆయా కంపెనీలను నడుపుతున్నందున ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వారికి ఇచ్చే ఆ జీతం ఎక్కువేమీ కాదన్న వాదన కూడా ఉంది.