అన్వేషించండి

Kolkata Doctor Rape and Murder Case : కోల్‌కతా డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాదు - సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చిన సీబీఐ ?

Kolkata : కోల్‌కతా వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ గుర్తించినట్లుగా తెలుస్తోంది. సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లుగా ఆధారాలు సేకరించారు.

CBI has found that the Kolkata doctor was not gang raped :   కోల్‌కతా  ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ వర్గాలు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది  ట్రైనీ డాక్టర్ పై సామూహిక అత్యచారమని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే  అందులో ఎలాంటి వాస్తవం లేదని సీబీఐ విచారణలో తేలినట్లుగా చెబతున్నారు.  సంజయ్ రాయ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని సీబీఐ నిర్ధారించినట్లుగా తెలస్తోంది.  పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మృతురాలి బాడీలో 150mg వీర్యం ఉందని   ప్రచారం జరిగింది. దాంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని సీబీఐ వర్గాలు తేల్చినట్లు అవుతోంది. 

దర్యాప్తును చివరి దశకు తెచ్చిన సీబీఐ 

ఆగస్టు తొమ్మితో తేదీన ఆర్జికల్ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే సంజయ్ రాయ్ అనే నిందితుడ్ని పట్టుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో ప్రధానంగా అతనే అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. పోలీసులు మొదట ఆత్మహత్యగా ప్రచారం చేశారని.. పోలీసుల తీరుపై అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో రాజకీయంగానూ కలకలం రేపింది. బెంగాల్ ప్రభుత్వం ఎవరినో కాపాడటానికి ప్రయత్నిస్తోందని విమర్శలు వచ్చాయి. చివరికి ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. 

మాకు డబ్బులొద్దు , న్యాయం కావాలి - కోల్‌కతా డాక్టర్ తల్లి భావోద్వేగ లేఖ !

నాలుగైదు రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు

అయితే సీబీఐకి కేసు అప్పగించిన తర్వాత కొత్త విషయలేమీ వెలుగులోకి రాలేదు. నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్ టెస్టులు నిర్వహించారు. అటాప్సీ రిపోర్టుతో పాటు అన్ని కోణాల్లోనూ సీబీఐ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు విషయంలో కోల్ కతాలో ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం చేసిన నిందితులకు ఉరిశిక్ష వేసేలా చట్టం కూడా మమతా  బెనర్డీ చేశారు. సీబీఐ విచారణ ఆలస్యమవుతోందని.. తాము అయితే ఈ పాటికి దర్యాప్తు పూర్తి చేసే వారమని మమతా బెనర్జీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

కోల్‌కతా డాక్టర్ కేసు సీబీఐ చేతికి వెళ్లడమే అడ్వాంటేజ్ - బీజేపీని ఇరుకున పెడుతున్న మమతా బెనర్జీ

ఇప్పటికే మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అరెస్టు                    

చివరికి సీబీఐ పైనా అసహనం వ్యక్తమయ్యే పరిస్థితులు రావడంతో మెల్లగా కేసు వివరాలను బయట పెడుతున్నట్లుగా తెలుస్తోంది. సామూహిక హత్యాచారం జరగలేదని.. సంజ్య రాయ్ ఒక్కడే చేసినట్లుగా తాజాగా లీక్ చేయడంతో పాటు ముందు ముందు కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగైదు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రిన్సిపల్ ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Happy Ugadi  Shubh Muhurat 2025: ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
Happy Ugadi Wishes in Telugu 2025: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Happy Ugadi  Shubh Muhurat 2025: ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
Happy Ugadi Wishes in Telugu 2025: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
Ugadi Pachadi : ఉగాది పచ్చడి తయారీ రెసిపీ.. ఈ ట్రెడీషనల్​ డిష్​లోని పోషకాలు ఇవే, ఎన్ని కేలరీలు ఉంటాయో తెలుసా?
ఉగాది పచ్చడి తయారీ రెసిపీ.. ఈ ట్రెడీషనల్​ డిష్​లోని పోషకాలు ఇవే, ఎన్ని కేలరీలు ఉంటాయో తెలుసా?
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Embed widget