Tamil Nadu local body Election: దగా.. దగా.. మోసం! ఇంట్లో ఉన్నది ఐదుగురు.. పడింది మాత్రం ఒకే ఒక్క ఓటు!
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. భాజపా తరుఫున పోటీ చేసిన ఓ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది.
ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు ఫలితాన్ని మార్చేస్తుంది.. అయితే ప్రస్తుతం ఆ ఒకే ఒక్క ఓటు ఓ భాజపా అభ్యర్థిని వైరల్ చేసింది. ఇందేంటి అనుకుంటున్నారా? అవును ఇటీవల జరిగిన తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. అదేంటో మీరే చూడండి.
ఇంట్లో ఉన్నది ఐదుగురు..
తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసిన ఓ అభ్యర్థికి చేదు అనుభవం మిగిలింది. కోయంబత్తూర్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన అతనికి ఒకే ఒక్క ఓటు పడింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆయన ఇంట్లో మొత్తం ఐదు ఓట్లుంటే కేవలం ఒకే ఓటు ఆయనకు పడింది.
భాజపాపై వ్యంగ్యాస్త్రాలు..
ఇటీవల జరిగిన తమిళనాడు స్థానిక సంస్థలకు ఎన్నికల్లో మొత్తం 27 వేలకు పైగా వార్డుల్లో 79,433 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో కోయంబత్తూర్ జిల్లాలోని పెరియనైకెంపాలెం అనే వార్డు నుంచి డీ కార్తిక్ అనే వ్యక్తి భాజపా తరపున పోటీ చేశాడు. ఆయన కుటుంబ సభ్యుల్లో మొత్తం ఐదుగురికి ఓటు హక్కు ఉంది. కానీ ఫలితాలు వచ్చాక చూస్తే ఆయనకు కేవలం ఒకే ఒక ఓటు పడింది. ఇంట్లో వాళ్లు కూడా అతనికి ఓటు వేయకపోవడంపై సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా ట్రోల్ అయింది. దీనిపై కొంత మంది ప్రముఖులు, ఇతర పార్టీ నేతలు కూడా స్పందించారు.
BJP candidate gets only one vote in local body elections. Proud of the four other voters in his household who decided to vote for others pic.twitter.com/tU39ZHGKjg
— Dr Meena Kandasamy ¦¦ இளவேனில் (@meenakandasamy) October 12, 2021
ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి కార్తిక్ విడుదల చేసిన పోస్టర్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో సహా మొత్తం ఏడుగురు జాతీయ స్థాయి నేతలున్నారని.. అయినా కనీసం ఏడు ఓట్లు కూడా పడలేదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Malabar Maritime Exercise Pics: చైనాకు భారత్ చెక్.. 'ఆపరేషన్ మలబార్'తో డ్రాగన్ గుండెల్లో గుబులు
Also Read: Corona Cases: గత 19 రోజులుగా 30 వేలకు దిగువనే కరోనా కేసులు
Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి