అన్వేషించండి

ఎంపీ టికెట్‌ ఆశించే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, ఎమ్‌కే స్టాలిన్‌కి వేలాది అప్లికేషన్‌లు

Lok Sabha Elections 2024: ఎంపీ టికెట్‌లు ఆశించే వారికి ఎమ్‌కే స్టాలిన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాష్ట్రాల్లోని పార్టీలు అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాయి. ఒక్కో పార్టీ లిస్ట్‌ని విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులోని DMK పార్టీ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి MK స్టాలిన్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆశావహులకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇప్పటికే పొత్తు లెక్కలు తేల్చిన ఎమ్‌కే స్టాలిన్..ఇప్పుడు పూర్తిగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి పెట్టారు. అలా అని ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారు. మార్చి 9న మొదలైన ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ ఇవాళ్టి (మార్చి 10) వరకూ కొనసాగింది. ఉదయం 9 గంటల నుంచే ఇవి ప్రారంభమయ్యాయి. వచ్చిన అప్లికేషన్స్‌ని అన్నింటినీ పరిశీలించారు స్టాలిన్. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశిస్తున్న 2,590 మంది తమ అప్లికేషన్‌లు పంపినట్టు తెలుస్తోంది. అందరి అప్లికేషన్స్ చూసి నంబర్‌ల వారీగా పిలిచి వాళ్లతో మాట్లాడారు సీఎం స్టాలిన్. ఆయనతో పాటు మరి కొందరు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సీట్‌ షేరింగ్ విషయంలోనూ DMK క్లారిటీ ఇచ్చింది. 21 చోట్ల DMK అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తరపున 10 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 

కాంగ్రెస్, డీఎమ్‌కే పొత్తు గురించి అందరికీ తెలిసిని విషయమే అయినా...ఉన్నట్టుండి కమల్ హాసన్ పార్టీ Makkal Needhi Maiam (MNM) కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌తో పాటు MNM తోనూ సీట్ల పంపకాలపై డీఎమ్‌కే తుది నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కి 10 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే...కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్‌కి లోక్‌సభ ఎన్నికల్లో కాకుండా వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికలకు ఓ సీట్ కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి సీట్‌లు కేటాయించే అవకాశాలైతే కనిపించడం లేదు. దేశ సంక్షేమం కోసం DMK కూటమితో చేతులు కలిపినట్టు కమల్ హాసన్ వెల్లడించారు. తాన ఏదో పదవి ఆశించి ఈ కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ని కలిసిన తరవాత కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే I.N.D.I.A కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకుంది డీఎమ్‌కే.

టాప్ హెడ్ లైన్స్

ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 11 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget