Tamil Bjp Leader : మహిళా నేతతో ఆన్‌లైన్ రొమాన్స్.. తమిళనాడు బీజేపీ ముఖ్య నేత రాజీనామా..!
మహిళా నేతతో అసభ్యంగా మాట్లాడుతున్న వీడియో లీక్ కావడంతో తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై కేసు పెట్టాలని పలు పార్టీల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి నేతలు తక్కువే కానీ కళాపోషలకులకు మాత్రం కొదవేం లేదు. కొత్తగా తమిళనాడు బీజేపీలో కీలక నేతగా చెప్పుకుంటూ హడావుడి చేసే కే.టి. రాఘవన్ అనే నేత మహిళా నేతలతో అర్థనగ్న చాటింగ్‌లు చేస్తూ వేధిస్తున్న విషయం బయట పడింది. వీడియోలతో సహా వెలుగులోకి రావడం సంచలనం అయింది. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కేటీ రాఘవన్ అనే నేత పదవిలో ఉన్నారు. ఆయనపై పార్టీలో అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం తనను తాను సచ్చీలుడిగా.. మేధావిగా ప్రకటించుకుంటూ ఉంటారు.
ఈ కేటీ రాఘవన్ ఓ మహిళతో అసభ్యకరంగా.. అర్థనగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడుతున్నారు. ఈ వీడియో కాల్ బయటకు వచ్చింది. ఆమె కూడా ఎవరో కాదు. బీజేపీలో జిల్లా స్థాయిలో ఉన్న నాయకురాలే. ఈ వీడియో కాల్‌ను బీజేపీకే చెందిన మరో వ్యక్తి బయట పెట్టారు. మదన్ అనే బీజేపీ నేత సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేశారు. బీజేపీ మహిళా నేతలతో కేటీ రాఘవన్ అసభ్యంగా ప్రవర్తిస్తూంటారని ఆయన ప్రవర్తన రోజు రోజుకు మితిమీరిపోతున్నందునే వీడియోను బయట పెట్టానని ఆయన చెుతున్నారు.
కేటీ రాఘవన్ ఒక్క జిల్లా మహిళా నేతతో మాత్రమే కాదని.. పలువురితో ఇలాగే ప్రవర్తిస్తూంటారని ఆయన అంటున్నారు. కేటీ రాఘవన్ తనను తాను పెద్దమనిషిగా చాటుకుంటున్నందునే ఆయన వీడియోలు బయటపెట్టానని స్పష్టం చేశారు. బాధితులైన ఎందరో గృహిణులు కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. మదన్ ఒక్క కేటీ రాఘవన్ గురించి మాత్రమే కాదు.. తమిళనాడు బీజేపీకి చెందిన 15 మంది నేతలకు సంబంధించిన ఇలాంటి అసభ్యకర వీడియోలు ఉన్నాయని.. సీరియల్‌గా ఈ ఏడాది మొత్తం విడుదల చేస్తూనే ఉంటానని ప్రకటించారు. మొత్తం 60 వీడియోలు ఉన్నాయన్నారు.
என்ன ராகவா இது !! #ktraghavan | #BJPLeader pic.twitter.com/lo6YC6dk69
— Bala D Rock (@teambala) August 24, 2021
వీడియో తమిళనాడులో సంచలనంగా మారింది. దీంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి కేటీ రాఘవన్ రాజీనామా చేశారు. రాఘవన్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి డీజీపీకి ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు తమిళనాడులో సంచలనం రేపుతోంది. ముందు ముందు ఎవరి వీడియోలను మదన్ బయట పెడతారోనని భయంతో బీజేపీ నేతలు వణికిపోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఇలాంటి వీడియోలు తరచూ బయటకు వస్తూనే ఉంటాయి. కొంత మంది నేతలు కక్కుర్తి పడటం.. మరికొంత మంది వాటిని బయట పెట్టడం జరుగుతూ ఉంటుంది.