Taliban Crisis News: తాలిబన్ల సూపర్ స్పీడ్.. ఆ రోజు చీఫ్ గెస్ట్ లుగా పాక్, చైనా
అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పంజ్ షీర్ ను ఆక్రమించుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. అఫ్గాన్ అభివృద్ధే లక్ష్యమని తెలిపారు.
![Taliban Crisis News: తాలిబన్ల సూపర్ స్పీడ్.. ఆ రోజు చీఫ్ గెస్ట్ లుగా పాక్, చైనా Taliban Spokesman Zabihullah Mujahid says 'War Has Ended, Islamic & Accountable Govt Will Be Formed' Taliban Crisis News: తాలిబన్ల సూపర్ స్పీడ్.. ఆ రోజు చీఫ్ గెస్ట్ లుగా పాక్, చైనా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/03/c6079d72fa9bb6c29faef4b3c24fb00f_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పంజ్ షీర్ వ్యాలీని హస్తగతం చేసుకున్నామని తెలిపిన తాలిబన్లు.. త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి ఆలస్యం చేయబోమని తాలిబన్ల ప్రతినిధి జబీవుల్లా ముజాహీద్ అన్నారు. అఫ్గానిస్థాన్ ఇక సుస్థిర దేశంగా మారిందన్నారు.
చిన్నచిన్న సాంకేతిక పనులు తప్ప కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందన్నారు. అఫ్గాన్ భవిష్యత్తును మార్చే ప్రభుత్వం త్వరలోనే కొలువుతీరుందన్నారు.
గత 20 ఏళ్లుగా అఫ్గాన్ భద్రత, రక్షణ దళాల్లో పనిచేసిన వారిని తిరిగి ఆ బాధ్యతల్లో రిక్రూట్ చేసుకుంటామని ఆయన అన్నారు. త్వరలోనే కాబూల్ లో ఉన్న హమిద్ కర్జాయి ఎయిర్ పోర్ట్ లో సేవలు పునరుద్ధరిస్తామన్నారు. ప్రస్తుతం ఖతార్, టర్కీ, యూఏఈకి చెందిన సాంకేతిక బృందాలు ఎయిర్ పోర్టును రిపేర్ చేస్తున్నారు.
అఫ్గాన్ నుంచి ముప్పు లేదు?
విద్రోహ శక్తులకు అఫ్గాన్ నిలయం కాదని ఈ సందర్బంగా జబీవుల్లా అన్నారు. ఇతర దేశాలతో మంచి సంబంధాలను తాము కోరుకుంటున్నామన్నారు.. అందులో చైనా పాత్ర కీలకమని స్పష్టం చేశారు.
Also Read: Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే
అతిథులుగా పాక్, చైనా..
అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైనట్లు ఏబీపీ సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి పాకిస్థాన్, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్ దేశాలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ కూడా స్పష్టం చేసింది.
పంజ్ షీర్ హస్తగతం..
పంజ్ షీర్ వ్యాలీని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. అఫ్గాన్ లో యుద్ధం ముగిసిందని ఈ మేరకు తాలిబన్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఖండించింది.
Also Read: Taliban Captured Panjshir: తాలిబన్ల వశమైన 'పంజ్ షీర్'.. ఖండించిన ఎన్ఆర్ఎఫ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)