X

Afghanistan Crisis Update: స్పీడు పెంచిన తాలిబన్లు.. సుప్రీం లీడర్ కనుసన్నల్లోనే పరిపాలన

సర్కార్ ఏర్పాటుకు తాలిబన్లు స్పీడు పెంచారు. కేబినెట్ కూర్పు కోసం ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే తమ ప్రభుత్వం సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదా కనుసన్నల్లోనే నడుస్తుందని తాలిబన్లు తెలిపారు.

FOLLOW US: 

అఫ్గానిస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా దళాలు అఫ్గాన్ ను వీడిన తర్వాత తాలిబన్లు జోరు పెంచారు. అయితే కొత్త ప్రభుత్వం ఎవరి నాయకత్వంలో పనిచేయనుందన్న విషయంపై తాజాగా తాలిబన్లు స్పష్టత ఇచ్చారు. ముల్లా హైబతుల్లా అఖుంద్ జాదా కనుసన్నల్లోనే ప్రధాని మంత్రి లేదా అధ్యక్షుడు ప్రభుత్వాన్ని పాలిస్తారని తాలిబన్లు తెలిపారు.

" కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇప్పటికే చర్చలన్నీ ముగిశాయి. కేబినెట్ కూర్పుపైనా అవసరమైన చర్చలు చేశాం. రాబోయే ఇస్లామిక్ ప్రభుత్వంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుంది. మా కమాండర్ అఖుంద్ జాదా కచ్చితంగా ప్రభుత్వంలో భాగమవుతారు. ఆయనే మా సుప్రీం లీడర్ ఇందులో ఎలాంటి సందేహం లేదు.                                        "
-  అనాముల్లా సమంగాని, తాలిబన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు 
 
అయితే రాబోయే తాలిబన్ల సర్కార్ లో అధ్యక్షడితో పాటు ప్రధాని మంత్రి కూడా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Also Read: Ahmad Massoud Profile: మసూద్.. 'పంజ్‌షీర్' కా బాద్ షా.. ఈ పేరు వింటేనే తాలిబన్లకు హడల్!

బరాదర్ అధ్యక్షుడిగా..

రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తాలిబన్ల రాజకీయ విభాగపు అగ్ర నేత అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముంది. ఈ మండలికి అధినాయకుడిగా తాలిబన్‌ సుప్రీం లీడర్‌ హైబతుల్లా అఖుంద్‌ జాదా ఉంటారు. ఆయన కనుసన్నల్లోనే తాము నడుచుకుంటామని తాలిబన్లు తెలిపారు. అఖుంద్‌జాదా ప్రస్తుతం కాందహార్‌లో ఉన్నారు. ఆయన, బరాదర్‌ త్వరలోనే కాబుల్‌లో బహిరంగంగా కనిపించే అవకాశాలున్నాయి. 

Also Read: Al Qaeda on Taliban: తాలిబన్లకు అల్ ఖైదా అభినందనలు.. 'కశ్మీర్'పై కీలక వ్యాఖ్యలు

తాలిబన్ల కవాతు..

అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో తాలిబన్ల ఉత్సాహానికి అంతులేకుండా పోయింది. అమెరికా వదిలి వెళ్లిన రక్షణ సామగ్రి, అఫ్గాన్‌ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కాందహార్‌లో బుధవారం బహిరంగంగా ప్రదర్శించారు. వాటితో కవాతు నిర్వహించారు. హమ్వీ వాహనాలు, బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌ వంటివి ఇందులో కనిపించాయి.

Also Read: Afghanistan news : ఫేక్.. తాలిబన్లు ఉరి తీసి హెలికాఫ్టర్‌లో వేలాడతీయలేదు ! అక్కడ అసలు జరిగింది ఇదే..

అఫ్గానిస్థాన్ సంక్షోభంపై ప్రత్యేక కథనాలు ఇక్కడ చూడండి..

Tags: Afghanistan news Taliban News Kabul News Taliban Latest News Afghanistan Taliban Crisis Taliban Supreme Leader

సంబంధిత కథనాలు

TDP On New Districts: రాజకీయ ప్రయోజనం కోసం రాత్రికి రాత్రి కొత్త జిల్లాలు... సమస్యలకు సమాధానం చెప్పలేక డైవ‌ర్షన్ గేమ్... టీడీపీ ఆరోపణలు

TDP On New Districts: రాజకీయ ప్రయోజనం కోసం రాత్రికి రాత్రి కొత్త జిల్లాలు... సమస్యలకు సమాధానం చెప్పలేక డైవ‌ర్షన్ గేమ్... టీడీపీ ఆరోపణలు

Sudeep Vikrant Rona Postponed: కరోనా వల్ల వాయిదా పడిన మరో పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'

Sudeep Vikrant Rona Postponed: కరోనా వల్ల వాయిదా పడిన మరో పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Covid Vaccine Update: మార్కెట్ విక్రయానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు.. కానీ అక్కడ మాత్రం దొరకవు!

Konda Movie: కొండా మూవీతో మళ్లీ తెరపైకి కొండా ఫ్యామిలీ... వరంగల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు...

Konda Movie: కొండా మూవీతో మళ్లీ తెరపైకి కొండా ఫ్యామిలీ... వరంగల్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు...

AP New Districts: కొత్త జిల్లాలపై ప్రణాళిక విభాగం క్లారిటీ... లోతైన అధ్యయనం చేశామని ప్రకటన...

AP New Districts: కొత్త జిల్లాలపై ప్రణాళిక విభాగం క్లారిటీ... లోతైన అధ్యయనం చేశామని ప్రకటన...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Stock Market Update: హమ్మయ్యా..! -1400 నుంచి -581కు పుంజుకున్న సెన్సెక్స్‌.. నిఫ్టీదీ అదే దారి!

Stock Market Update: హమ్మయ్యా..! -1400 నుంచి -581కు పుంజుకున్న సెన్సెక్స్‌.. నిఫ్టీదీ అదే దారి!

Balakrishna : రాజకీయాలొద్దు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి.. ప్రభుత్వానికి బాలకృష్ణ డిమాండ్ !

Balakrishna :  రాజకీయాలొద్దు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి.. ప్రభుత్వానికి బాలకృష్ణ డిమాండ్ !

Shweta Tiwari: 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు'... సీరియల్ నటి వ్యాఖ్యలపై మంత్రి సీరియస్... విచారణకు ఆదేశం

Shweta Tiwari: 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు'... సీరియల్ నటి వ్యాఖ్యలపై మంత్రి సీరియస్... విచారణకు ఆదేశం

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!