IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

Afghanistan news : ఫేక్.. తాలిబన్లు ఉరి తీసి హెలికాఫ్టర్‌లో వేలాడతీయలేదు ! అక్కడ అసలు జరిగింది ఇదే..

తాలిబన్లు అమెరికా సైనిక హెలికాఫ్టర్‌కు వ్యక్తిని ఉరి తీసి వేలాడదీసి తిప్పారన్న ప్రచారం ఫేక్ అని తేలింది. ఈ ట్వీట్ చేసిన అమెరికా సెనెటర్ తర్వాత తన ట్వీట్‌ను డిలీట్ చేశారు.

FOLLOW US: 

అదిగో తోక అంటే ఇదిగో పులి అనే టైప్ జనం ఎక్కువ ! సోషల్ మీడియా మాయలో పడి కొట్టుకుపోయేవారైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తాలిబన్ల విషయంలో అదే జరుగుతోంది. ఎక్కడ ఏం జరిగినా.. అది తాలిబన్లకు అంటగట్టేసి ప్రచారం చేస్తున్నారు. ఆప్ఘనిస్థాన్‌లో అమెరికాకు చెందిన రక్షణ శాఖ విమానం నుంచి ఓ వ్యక్తి వేలాడుతూ వెళ్తున్న దశ్యాలు రెండురోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాకు చెందిన ఓ సెనెటర్ ఈ దృశ్యాలను పోస్ట్ చేసి తాలిబన్లు ఎవరినో ఉరి తీశారని .. వారి క్రూరత్వానికి నిదర్శమని ట్వీట్లు చేశారు. 

దీంతో ఇతరులు కూడా తాలిబన్లు ఓ వ్యక్తిని ఉరి తీసి అలా వేలాడ దీశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. అందరూ నమ్మేశారు కూడా. ఎందుకంటే తాలిబన్లు అంత కంటే దారుణమైన ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బయటకు తాలిబన్లు మాత్రం చాలా శాంతి ప్రవచనాలు చెబుతున్నారు. నిజానికి వారు హింసకు పాల్పడుతున్నారో లేదో నేరుగా ఎవరికీ తెలియదు. ఎంత మందిని చంపుతున్నారో స్పష్టత లేదు. కానీ అప్పుడప్పుడూ బయటకు వస్తున్న ఇలాంటి దృశ్యాలను వారి క్రూరత్వానికి ఆపాదించి.. వారంటే ప్రపంచం మరింత బయపడేలా చేస్తున్నారు. 

నిజానికి హెలికాఫ్టర్‌కు మనిషి వేలాడుతున్న దృశ్యం తాలిబన్ల ఆకృత్యానికి సంబంధించినది కాదు. ఆ తాడుకు వేలాడుతున్న వ్యక్తి కూడా చనిపోలేదు. ఆ వీడియో కాందహార్ నుంచి వచ్చింది. అది అమెరికాకు చెందిన హెలికాఫ్టర్ . తాలిబన్లకు శిక్షణ పొంది.. ఆ అమెరికా సైనిక హెలికాఫ్టర్‌ను నడిపే పైలట్లు ఎవరూ లేరు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా ఖాళీ చేయడంతో కాందహార్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎగురవేయాలనుకున్నారు. ఆ కార్యాలయంపైకి ఎలా చేరుకోవాలో అర్థం కాలేదు. హెలికాఫ్టర్ ద్వారా వేలాడుతూ కట్టాలని ప్రయత్నించారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఆ దృశ్యాల్లో కూడా ఉరి వేసినట్లుగా లేదు. తాలిబన్ జెండా పట్టుకున్నట్లుగా ఉంది. దీంతో ఆ అమెరికా సెనెటర్ కూడా తను చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఏం జరుగుతుందో కానీ అక్కడి పరిస్థితులు ప్రపంచం ముందు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. తాలిబన్లు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారనడానికి అనేక ఉదంతాలు బయట పడుతున్నాయి. అయితే నిజంగా అవి అక్కడ జరిగినవేనా లేక కల్పితాలా అన్నది ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో ప్రభావంతో జరిగిన దాని కన్నా తీవ్రత ఎక్కువ ప్రచారం అవుతోంది. 

Published at : 01 Sep 2021 07:20 PM (IST) Tags: taliban afghanistan Afghanistan news kandhahar hanging

సంబంధిత కథనాలు

AP Telangana Breaking News Live: తూ.గో. జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు, మరోసారి హైటెన్షన్

AP Telangana Breaking News Live: తూ.గో. జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు, మరోసారి హైటెన్షన్

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Karnataka News: ఏందిరా నీ సారీ గోల- కాలేజీ గోడలు, మెట్ల నిండా 'సారీ' కోటి!

Karnataka News: ఏందిరా నీ సారీ గోల- కాలేజీ గోడలు, మెట్ల నిండా 'సారీ' కోటి!

Yasin Malik: కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష వేయాలి: NIA

Yasin Malik: కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష వేయాలి: NIA

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

AP As YSR Pradesh : వైఎస్ఆర్‌ ప్రదేశ్‌గా ఏపీ - సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ !

AP As YSR Pradesh :   వైఎస్ఆర్‌ ప్రదేశ్‌గా ఏపీ - సీఎం జగన్‌కు సలహా ఇచ్చిన రిటైర్డ్ ఐపీఎస్ !

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Aakanksha Singh Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆకాంక్ష సింగ్

Aakanksha Singh Photos: మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉన్న ఆకాంక్ష సింగ్

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా