By: ABP Desam | Updated at : 23 Aug 2021 01:31 PM (IST)
పంజ్ షీర్
అఫ్గానిస్థాన్ వశం చేసుకున్న తాలిబన్లు తమకు తిరుగులేదనుకున్నారు. దేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. అఫ్గాన్ సైన్యం కూడా ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. దీంతో ఇంకా పేట్రేగిన తాలిబన్లు పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు తాలిబన్లకు పంజ్ షీర్ భయం పట్టుకుంది. అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు తమను సవాలు చేస్తున్న పంజ్‌షీర్ లోయ ఆక్రమణకు ప్రయత్నించారు.
Also Read: Kabul Evacuation: అఫ్గాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 392 మంది.. వైరల్ అవుతోన్న చిన్నారి వీడియో
పంజ్ షీర్ సైన్యం ఆధీనంలో తాలిబన్ కమాండర్లు
పంజ్ షీర్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు యత్నించిన తాలిబన్లలో 300 మందిని స్థానిక సైన్యం మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. పంజ్‌షీర్ సైన్యం ప్రకటించినట్లుగా 300 మంది తాలిబన్లు మృతి చెందారని, వందల మంది తాలిబన్లు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. బాగ్లాన్, అంద్రాబ్ ప్రాంతాలు తిరిగి కైవసం చేసుకున్నట్లు పంజ్ షీర్ సైన్యం తెలిపింది. మరికొందరు తాలిబన్లు భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ వైపు కదులుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు తాలిబన్ కమాండర్లు తమ ఆధీనంలో ఉన్నట్లు పంజ్ షీర్ సైన్యం చెబుతోంది.
Update from the Anti-Taliban resistance - they tell me: Taliban ambushed in Andarab of Baghlan province. At least 300 Taliban fighters were killed. The group is lead by #AhmadMassoud & @AmrullahSaleh2 #Afghanistan pic.twitter.com/uJD1VEcHY1
— Yalda Hakim (@BBCYaldaHakim) August 22, 2021
Also Read: Afghanistan Crisis News: తాలిబన్ల నెక్ట్స్ టార్గెట్ అదే.. పంజ్‌షిర్ వైపు వందలాదిగా తరలుతోన్న వైనం..
తాలిబన్లను ఢీకొట్టి...
తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్ ప్రజలు బలంగానే చెబుతున్నారు. పంజ్‌షీర్ లోయలోకి వెళ్లే అన్ని మార్గాల్లో ఎక్కడికక్కడ గట్టి భద్రత ఏర్పాటు చేసుకున్నారు. తాలిబన్లను ఢీకొట్టి ఎదురునిలిచిన పంజ్‌షీర్ ప్రావిన్స్ ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తాలిబన్ల చెర నుంచి అఫ్గాన్‌ను విముక్తి చేసేది అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని పంజ్‌షీర్ సైన్యమే అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
ఐదు సింహాల దేశం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రాంతం పంజ్ షీర్. జనాభా లక్షన్నర వరకు ఉంటుంది. ఈ ప్రావిన్స్ తాలిబన్ల అరాచకానికి ఎదురొడ్డి నిలుస్తోంది. పంజ్ షీర్ సైన్యాన్ని ముందుండి నడిపిస్తుంది మిలటరీ కమాండర్అహ్మద్ షా మసూద్. ఆయన తనయుడు అహ్మద్ మసూద్. పంజ్ షీర్ అంటే ఐదు సింహాలు అని అర్థం. నాలుగు గంటల్లో లొంగిపోవాలని తాలిబన్లు పంజ్ షీర్ ప్రజలకు అల్టిమేటం జారీ చేశారు. పంజ్‌షీర్ ప్రజలు ఈ హెచ్చరికలు లెక్కచేయలేదు. తిరిగి యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. తాలిబన్లు దాడి చేయాలని చూస్తే వారికి భారీ నష్టం తప్పదని ముందుగానే హెచ్చరించారు.
Whatsapp New Feature : గుట్టుగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు - వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి తెలుసా ?
Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!
Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయమ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
Nabha Natesh Photos: కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే
World Hypertension Day సర్వే ఫలితాలు ఆశ్చర్యం, బాధను కల్గించాయ్, 45 ఏళ్లు దాటితే బీపీ, షుగర్ టెస్టులు తప్పనిసరి: హరీష్ రావు