Supreme Court: చట్టాన్ని నిలిపివేయాలా..? మా మాటంటే కేంద్రానికి లెక్క లేదు: సుప్రీం
ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చే తీర్పులపై గౌరవం లేనట్టుగా కేంద్రం చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం నిర్ణయాలను ప్రభుత్వం గౌరవించడం లేదని.. కోర్టు సహనాన్ని పరీక్షించవద్దని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రిబ్యునల్స్‌లో ఖాళీలు భర్తీ చేయకపోవడంపై, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టాన్ని ఆమోదించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
Supreme Court expresses its displeasure over the way the Centre enacted the Tribunals Reforms Act 2021.
— ANI (@ANI) September 6, 2021
The CJI says we are not interested in or inviting any confrontation (with the govt), we are listing the matter for further hearing till next Monday. pic.twitter.com/4T6XX6wI9A
ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీపై దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్బంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Also Read: Covid-19 Symptoms: కరోనా సరికొత్త లక్షణాలు.. ఓసారి చెక్ చేసుకోండి ఉన్నాయేమో!
Also Read: Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే
అయితే వీటిపై సమాధానమిచ్చేందుకు 2-3 రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. దీంతో విచారణను సెప్టెంబర్ 13కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఆలోగా నియామకాలు జరుగుతాయని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
Also Read: Kerala HC on Covid19: 'కొవిషీల్డ్ రెండో డోసు 4 వారాల తర్వాత ఇచ్చేయండి'