Covid-19 Symptoms: కరోనా సరికొత్త లక్షణాలు.. ఓసారి చెక్ చేసుకోండి ఉన్నాయేమో!
కేవలం జలుబు, గొంతునొప్పి కాదు.. కరోనాకు ఇంకా కొత్త లక్షణాలు వచ్చాయట. మరి ఆ లక్షణాలను ఓసారి మీరూ చూసి.. జాగ్రత్త పడండి.
కరోనా.. ఈ పేరు మొదటిసారి విని రోజులు, నెలలే కాదు ఇక సంవత్సరాలు కూడా గడిచిపోతాయేమో. అవును వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కూడా జనాల్లో ఇంకా కరోనా భయం అలానే ఉంది. వ్యాక్సిన్ లు కూడా పనిచేయని కొత్త కొత్త వేరియంట్లతో కరోనా మళ్లీ మళ్లీ వస్తుంటే.. గుండే ఝల్లుమంటోంది. ఇప్పుడు కరోనా గురించి మరో కొత్త విషయం తెలిసింది. అది ఏంటో మీరే చదవండి.
జలుబు, గొంతునొప్పి, జ్వరం, తలనొప్పి.. ఒకప్పుడు ఈ లక్షణాలు ఉంటే ఆటోమేటిక్ గా కరోనా వచ్చింది అని అంతా అనుకునేవారు. మీరు అలానే అనుకున్నారా? కానీ ఇది ఒకప్పటి మాట.
స్మెల్, టేస్ట్ తెలియడం లేదా? అయితే ఈసారి కచ్చితంగా కరోనానేయే అను అంటున్నారు. కానీ ఇది మొన్నమొన్నటి మాట. అయితే కరోనా వివిధ వేరియంట్లుగా రూపంతరం చెందుతున్నట్లు లక్షణాలు కూడా మారాయి.. మరి తాజా కరోనా లక్షణాలేంటో తెలుసా? ఈ కొత్త లక్షణాలు ప్రస్తుతం పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. మరి మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.
యూనివర్సల్ లక్షణాలు..
- జ్వరం
- పొడి దగ్గు
- నీరసం
సాధారణ లక్షణాలు..
- ఒళ్లు నొప్పులు
- గొంతు నొప్పి
- డైయేరియా (నీళ్ల విరోచనాలు)
- కండ్లకలక
- తలనొప్పి
- రుచి, వాసన కోల్పోవటం
తీవ్రమైన లక్షణాలు..
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- ఛాతీ నొప్పి, ఒత్తిడి
- మాట్లాడటంలో ఇబ్బంది
కొత్త లక్షణాలు..
- వినికిడి లోపం
- వికారం
- వాంతులు
- చర్మంపై బొబ్బలు
- చేతి, కాలి వేళ్లు రంగు మారడం
ఇప్పటికే అల్లకల్లోలమైన ప్రపంచానికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతోంది కరోనా. ఉన్నవి సరిపోవన్నట్లు ఈ కొత్త లక్షణాలు కూడా వచ్చాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. కరోనా థర్డ్ వేవ్ పైన కూడా ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
Also Read: Nipah Virus: నిఫా- కరోనా ఒకేసారి వస్తే? ఈ వైరస్ గురించి షాకింగ్ విషయాలివే