అన్వేషించండి
Advertisement
SC On Hijab: నమాజ్ తప్పనిసరి కానప్పుడు, హిజాబ్ ఎలా?: సుప్రీం సూటి ప్రశ్న
SC On Hijab: ఇస్లాంలో నమాజ్ తప్పనిసరి కానప్పుడు.. హిజాబ్ ఎందుకు కంపల్సరీ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
SC On Hijab: హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టులో గురువారం వాడివేడి వాదనలు జరిగాయి. ఇస్లాంలో నమాజ్ తప్పనిసరి కానప్పుడు, హిజాబ్ ఎందుకు కంపల్సరీ అని ముస్లిం పక్షాన్ని సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది.
" ఇస్లాంలోని ఐదు ప్రధాన సిద్ధాంతాలు నమాజ్, హజ్, రోజా, జకాత్, ఇమాన్ పాటించడం తప్పనిసరి కాదని పిటిషనర్లు వాదిస్తున్నప్పుడు.. ముస్లిం మహిళలకు హిజాబ్ ఎలా తప్పనిసరి అయింది. "
-సుప్రీం కోర్టు
అంతకుముందు
ఇస్లాంలోని ఐదు సిద్ధాంతాలను పాటించమని ఇస్లాంలో బలవంతం చేయలేదని వాదనల సందర్భంగా పిటిషనర్ ఫాత్మా బుష్రా తరఫు న్యాయవాది మహ్మద్ నిజాముద్దీన్ పాషా అంతకుముందు అన్నారు. దీంతో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియా ధర్మాసనం ఈ మేరకు ప్రశ్నించింది.
" ఇస్లాంలో ఈ సిద్ధాంతాలను అనుసరించండి అని బలవంతం చేయడం లేదని ఇవి అవసరం కాదని అర్థం కాదు. ఇది ఇస్లాంను నమ్మే వాళ్లను బలవంతంగా ఇతర మతాలకు మార్చకుండా ఉండేందుకు ఉద్దేశించింది. కర్నాటక హైకోర్టు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంది. అందుకే ఇస్లాంలో హిజాబ్ ముఖ్యమైన ఆచారం కాదని, విద్యాసంస్థల్లో దానిని నిషేధించవచ్చని తీర్పు ఇచ్చింది. "
-నిజాముద్దీన్ పాషా, ముస్లిం పక్షం న్యాయవాది
కచ్చితమా?
" ఇస్లాంలోని ఐదు ప్రధాన ఆచారాలు లేదా సిద్ధాంతాలను తప్పనిసరిగా పాటించాలని లేనప్పుడు హిజాబ్‌ను మాత్రం ముస్లిం మహిళలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఎలా అంటారు? అందులోనూ విద్యాసంస్థల్లో కూడా దీనిని కచ్చితంగా ధరించాలని ఎలా చెబుతారు? "
-సుప్రీం ధర్మాసనం
సుప్రీం ప్రశ్నకు బదులిస్తూ.. యావత్ ప్రపంచం కంటే మహిళలకు తన ముసుగే ముఖ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పినట్లు పాషా అన్నారు.
" ప్రవక్త మాటలను అనుసరించండి అని ఖురాన్ చెప్పినప్పుడు.. ఒక ముస్లిం అమ్మాయి బయటకు వెళ్లేటప్పుడు హిజాబ్ ధరించాలని నమ్ముతున్నప్పుడు, మతం ప్రాతిపదికన విద్యా సంస్థల్లోకి ముస్లిం బాలికలను అనుమతించకుండా నిషేధించవచ్చా? సిక్కు విద్యార్థులు పాఠశాలలకు పట్కా లేదా తలపాగా ధరించినప్పుడు, హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను విద్యా సంస్థల్లోకి ప్రవేశించకుండా నిషేధించడం అంటే ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కదా. "
-నిజాముద్దీన్ పాషా, ముస్లిం పక్షం న్యాయవాది
Also Read: King Charles III: క్వీన్ ఎలిజబెత్ 2 వారసుడు ఎవరో తెలుసా?
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 6,093 కరోనా కేసులు నమోదు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion