SC on Demonetisation: మోదీ సర్కార్‌కు సుప్రీం కోర్టు షాక్- నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్‌బీఐకి నోటీసులు!
SC on Demonetisation: నోట్ల రద్దు అంశంపై కేంద్రం, రిజర్వు బ్యాంకుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని పరిశీలించాలని సుప్రీం అభిప్రాయపడింది.
SC on Demonetisation: 2016లో మోదీ సర్కార్ తీసుకున్న 'నోట్ల రద్దు' అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పెద్ద నోట్లు రద్దు చేయడానికి నిర్ణయం తీసుకునేందుకు చేసిన కసరత్తుకు సంబంధించిన అన్ని వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని కేంద్రం, ఆర్‌బీఐకి సుప్రీం నోటీసులు ఇచ్చింది.
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లపై నవంబరు 9న విచారణ జరుపుతామని సుప్రీం తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీనిని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. నోట్ల రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయినా ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.
SC's Constitution Bench issues notice on all intervening applications & fresh petitions challenging Centre's decision to demonetize Rs 500 & 1,000 notes in 2016 & consider whether issue of demonetisation is academic. Centre & RBI seek time to file affidavits. Next hearing, Nov 9 pic.twitter.com/77sNZNeNLj
— ANI (@ANI) October 12, 2022
ప్రతిపక్షం
2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ ఇప్పటికీ విమర్శలు చేస్తోంది. దీని వల్ల జీడీపీ క్షీణతతో పాటు, దేశంలోని అసంఘటిత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆరోపిస్తోంది.
Also Read: Diwali Bonus: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్- దీపావళి కానుకగా 78 రోజుల బోనస్!
Also Read: Jharkhand Viral News: హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు- 10 రోజుల్లో ఆలయం ఖాళీ చేయాలట!