States’ Startup Ranking 2021: స్టార్టప్స్‌ను ప్రోత్సహించడంలో గుజరాత్ , కర్ణాటక టాప్ - తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయంటే ?
స్టార్టప్స్‌కు సాయం చేసేలా ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయగలిగిన రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటక అగ్రస్థానంలో నిలిచాయి. ర్యాంకింగ్‌లను కేంద్రం విడుదల చేసింది.
States’ Startup Ranking 2021: ఇప్పుడు ప్రపంచం మొత్తం స్టార్ట్ అప్స్ జపం చేస్తోంది. ఇలాంటి స్టార్టప్‌కు ప్రోత్సాహం ఇవ్వడంలో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. అయితే చాలా రాష్ట్రాలు స్టార్టప్స్ సక్సెస్ అయ్యేలా మెరుగైన విధానాల్ని అవలంభిస్తున్నాయి. అలాంటి రాష్ట్రాలకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. ఏ కేటగిరిలో గుజరాత్, కర్ణాటక అగ్రస్థానంలో నిలిచాయి. బి కేటగిరిలో మేఘాలయ అగ్రస్థానంలో నిలిచింది. ఏ కేటగిరి అంటే కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, బీ కేటగిరి అంటే కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు.
కేటగిరి ఏలో గుజరాత్, కర్ణాటక తర్వాత తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా రాష్టాలు ఉన్నాయి. కేటగిరి బిలో రెండో స్థానంలో జమ్మూకశ్మీర్ ఉంది. కేటగిరి ఏలో ఆరు నుంచి పదో స్థానం వరకు తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అసోం రాష్ట్రాలు నిలిచాయి. చివరి రెండు స్థానంలో బీహార్, ఆంద్రప్రదేశ్ ఉన్నాయి. చిట్ట చివరి స్థానంలో ఆంద్రప్రదేశ్ ఉంది. కేటగిరి బీలో చిట్ట చివరిలో లద్దాఖ్ ఉంది.
States & UTs across India have strengthened their startup policy framework over the 3 editions of the States’ Startup Ranking.
— Piyush Goyal (@PiyushGoyal) July 4, 2022
Best Performers, Top Performers, Leaders & Aspiring Leaders categorised on the basis of feedback for the reforms carried out.#Startups4NewIndia pic.twitter.com/BBwNTQ5koN
స్టార్టప్ వ్యవస్థకు దన్నుగా నిబంధనల వాతావరణాన్ని సులభతరం చేసే బాటలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్ విడుదల చేస్తోంది. ఈ ఏడాది 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో రాష్ట్రాలవారీగా ర్యాంకులను ప్రకటించింది. అంతక్రి తం 2020 సెప్టెంబర్‌లో ర్యాంకులను ప్రకటించింది. గుజరాత్ టాప్ ర్యాంకులో నిలిచింది. ఇప్పుడు కూడా అదే స్థానం నిలబెట్టుకుంది.
వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అండగా నిలిచిన రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ర్యాంకులను విడుదల చేశారు. పోటీ, సహకార సమాఖ్య విధానాల ద్వారా దేశీ విజన్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ర్యాంకింగ్‌ను చేపట్టింది. స్టార్టప్‌ల వృద్ధికి అనుగుణంగా సరళతర నియంత్రణల అమలుతోపాటు వ్యవస్థ పటిష్టతకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలుత 2018లో ర్యాంకింగ్ విధానాన్ని ప్రారంభించింది.