అన్వేషించండి

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ప్రకటించింది. మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయని వెల్లడించింది.

Southwest Monsoon : భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. వ్యవసాయరంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ ప్రకటించింది. ముందుగా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ భావించినప్పటికీ మూడు రోజుల ముందుగానే ఆదివారం కేరళలో ప్రవేశించాయిని పేర్కొంది. భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఈ విషయాన్ని ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో మే 27వ తేదీన కేరళకు చేరుకునే అవకాశం ఉందని ఓ దశలో ఐఎండీ అంచనా వేసింది. 

ఈ ఏడాది సాధారణ వర్షపాతం 

పగటి పూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదుతున్న వేళ ఐఎండీ చల్లడి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో రుతుపవనాలు ఈ ఏడాది త్వరగా భారత్‌లోకి ప్రవేశించాయని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే స్పష్టం చేసింది. 

మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

అయితే సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే దేశంలోకి వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల మే 27న కేరళకు రుతుపవనాలు చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఆ సమయానికి నాలుగు రోజులు తేడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల్లో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. సాధారణం కంటే చాలా ముందుగానే అంటే మే 16వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. కేరళ నుంచి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించే నైరుతి రుతుపవనాలు మరో వారంలో  తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Embed widget