Sonali Phogat Death: ఫోగట్ హత్య కేసులో మొత్తం ఐదుగురు అరెస్ట్, ఆ డ్రగ్గే ప్రాణం తీసిందా?
Sonali Phogat Death: భాజపా లీడర్ సోనాలి ఫోగట్ హత్య కేసులో మొత్తం 5గురిని అరెస్ట్ చేశారు.
Sonali Phogat Death:
రెస్టారెంట్ ఓనర్‌పైనా కేసు..
భాజపా నేత సోనాలి ఫోగట్‌ది హత్యేననటానికి కావాల్సిన బలమైన సాక్ష్యాధారాలు పోలీసులకు లభిస్తున్నాయి. గోవాలోని ఓ క్లబ్‌లో ఆమెతో బలవంతంగా ఓ డ్రింక్ తాగించారని అదే ఆమె మృతికి కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. అప్పటి వరకూ ఆమె గుండె పోటుతో మరణించారని అనుకున్నా...ఈ వివరాలు తెలిశాక హత్యాకేసు నమోదు చేశారు. ఆ తరవాత ఫోగట్‌కు సన్నిహితులైన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కేసులో కీలకంగా ఉన్న డ్రగ్ డీలర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ డీలర్ నుంచే...సోనాలి ఫోగట్ సన్నిహితులకు డ్రగ్స్ అందాయని సమాచారం. ఈ డీలర్‌తో పాటు రెస్టారెంట్ యజమానిని కూడా అరెస్టయ్యాడు. సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్‌లను 10 రోజుల పాటు కస్టడీలో ఉంచనున్నారు. వీరిద్దరిపైనా హత్యాకేసు పెట్టిన పోలీసులు..డ్రగ్ డీలర్, రెస్టారెంట్ ఓనర్‌పై నార్కోటిక్ డ్రగ్స్, Psychotropic Substances Act కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకూ ఈ కేసు విషయమై 25 మంది విచారించారు. రెస్టారెంట్ స్టాఫ్‌తోనూ మాట్లాడారు. ఫోగట్ ఉన్న రిసార్ట్‌లోని సిబ్బందితో పాటు ఆసుపత్రి స్టాఫ్‌నూ విచారించారు.
ఆ డ్రగ్స్ తీసుకోవటం వల్లే..?
చనిపోవటానికి ముందు సోనాలి ఫోగట్‌తో బలవంతంగా "మెథామ్‌ఫెటమైన్ డ్రగ్స్" ఇచ్చారని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ రెస్టారెంట్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి ఇది కన్‌ఫమ్ చేశారు. ఆ డ్రింగ్ తాగగానే..ఆమె అన్ ఈజీగా ఫీల్ అయినట్టు సీసీ ఫుటేజ్‌లో తెలుస్తోంది. ఆమె నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ...తన అసిస్టెంట్‌పై వాలిపోయారు. అప్పటికప్పుడు ఆమెను తన అసిస్టెంట్‌లుహోటల్‌కు తరలించారు. తెల్లవారి ఉదయం సెయింట్ ఆంథోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడే ఆమె మృతి చెందారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్...ఈ కేసుని సీబీఐ తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఫార్మాలిటీసీ అన్నీ పూర్తయ్యాక...ఇంకా విచారణ అవసరం అనుకుంటే CBI కేసు అప్పగిస్తామని వెల్లడించారు. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్...విజ్ఞప్తి మేరకు...ఈ నిర్ణయం తీసుకుంటారమని తెలిపారు.
శరీరంపై గాయాలు
శరీరంపై కొన్ని చోట్ల గాయాలు కూడా అయినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కెమికల్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాక కానీ..ఏ విషయం తేల్చలేమని పోలీసులు స్పష్టం చేశారు. గోవాలోనే కాకుండా ఛండీగఢ్‌లోనూ కెమికల్ ఎగ్జామినేషన్ చేయిస్తామని హరియాణా సీఎం ఖట్టర్ వెల్లడించారు. ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసే విషయంలోనూ ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆమెపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలూ చేస్తున్నారు. ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేయటంతో పాటు ఆమె ఆస్తులు కాజేయాలన్న దురుద్దేశంతోనే ఎవరో హత్య చేయించారని ఆమె సోదరుడు వాదిస్తున్నారు. 2008 నుంచి భాజపాలోనే ఉన్న సోనాలి ఫోగట్...2019లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. హరియాణాలోని ఫతేబాద్ జిల్లాలో భూటాన్ కలాన్ గ్రామంలో జన్మించారు సోనాలి. హిసార్‌కు చెందిన పొలిటీషియన్ సంజయ్ ఫోగట్‌ను వివాహం చేసుకున్నారు.