Search of Father : తండ్రి పేరు మాత్రమే తెలుసు - కానీ వెదుక్కుంటూ జపాన్ నుంచి వచ్చేశాడు - కన్నీళ్లు పెట్టించే కుమారుడి కథ
Japan Boy : చిన్నప్పుడు తప్పిపోయి పెద్దయిన తర్వాత తండ్రిని వెదుక్కునే హీరోల కథలు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే వచ్యాయి. కానీ నిజంగా జరిగే ఘటనలు మాత్రం మనసును ద్రవింప చేస్తాయి. అలాంటి ఘటనే ఇది.
The story will make you emotional : అనగనగా ఓ అబ్బాయి..ఓ ఊరెళ్లాడు. అక్కడ అమ్మాయి పరిచయం అయింది. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ పండి ఓ అబ్బాయి కూడా పుట్టాడు. కానీ తర్వాత విధి వక్రీంచింది. ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆ బాబు పెద్దయిన తర్వాత తన తండ్రెవరో తెలసుకునేందుకు ప్రపంచయాత్రకు బయలుదేరాడు. చివరికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తండ్రి వద్దకు చేరాడు. ఇదంతా చదివిన తర్వాత ఎక్కడో చదివిన .. చూసిన సినిమా కథ లాగుందే అనిపిస్తుంది. కానీ ఇది రియల్ స్టోరీ.
పంజాబ్ కు చెందిన సుఖ్ పాల్ సింగ్.. కొన్నేళ్ల కిందట ధాయ్ ల్యాండ్ కు వెళ్లాడు. అక్కడ జపాన్‌కు చెందిన ఓ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2002లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి టోక్యోకు దగ్గరగా ఉన్న ఓ పట్టణంలో కాపురం పెట్టుకున్నారు. 2003లో వారికి ఓ అబ్బాయి పుట్టాడు. తర్వాత వివిద కారణాల వల్ల సుఖ్ పాల్ సింగ్ జపాన్ విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది. అక్కడ భార్య పిల్లలను వదిలి పెట్టేసి ఇండియాకు వచ్చాడు. అమృత్ సర్ లో జీవించడం ప్రారంభించాడు. ఏళ్లు గడిచిపోయాయి కానీ..భార్య ..బిడ్డ సమాచారం మాత్రం లేదు.
యూకే అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్ - పదిహేనేళ్లకే కానిచ్చేస్తున్నారట !
అత్కడ జపాన్ లో సుఖ్ పాల్ సింగ్ కొడుకు రిన్ ..చదువులు కొనసాగిస్తూ తల్లితో పాటే నివసిస్తూ వచ్చాడ. తండ్రి లేని లోటు తెలియకండా ఆ తల్లి పెంచింది. అయితే ఓ సారి స్కూల్లో ఫ్యామిలీ ట్రీ సెషన్ నిర్వహించారు. ఇందులో తల్లి తరపున ఫ్యామిలీ ట్రీ.. తర్వాత తండ్రి తరపున ఫ్యామిలీ ట్రీని సిద్ధం చేయాలి. తల్లి తరపు ఫ్యామిలీ ట్రీని సిద్ధం చేసినా.. తండ్రి విషయంలో పేరు తప్ప మరింకేమీ తెలియకపోవడంతో రిన్ నిరాశపడ్డాడు. తన తండ్రి గురించి తెలుసుకోవాలని.. ఎలాగైనా కలవాల్సిందేనని పట్టుదలగా బయలుదేరాడు.
కేరళ సినీ పరిశ్రమలో జాతీయ ఉత్తమ చిత్రం "ఆట్టం" కథే రిపీట్ - ఇప్పుడు జరుగుతోదంంతా అదే నాటకం !
గూగుల్ మ్యాప్స్ సాయంతోనే రిన్ బయలుదేరాడు. తన తండ్రి పేరు సుఖ్ పాల్ సింగ్ అని మాత్రమే తెలుసు. ఆ పేరు ను పట్టుకుని వెదుక్కుంటూ ఉండియాకు వచ్చాడు. ఒక్కో సమాచారం సేకరిస్తూ.. ఫైనల్‌గా అమృత్ సర్ లో తన తండ్రిని చేరుకున్నాడు. తన కోసం ఎన్నో కష్టాలు పడి వచ్చిన కుమారుడ్ని చూసి.. సుఖ్ పాల్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన కుమారుడ్ని కలుస్తానని అనుకోలేదని అంతా కలలోలా జరిగిపోయిందని సుఖ్ పాల్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. వీరు కలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చూసిన వాళ్లంతా భావోద్వేగానికి గురవుతున్నారు.
What a moment ❤️
— Akashdeep Thind (@thind_akashdeep) August 24, 2024
Sukhpal Singh and his Japanese son Rin Takahata reunited after 19 years when Rin, inspired by a college assignment, traced his father to Amritsar, India. Rin was welcomed warmly by Sukhpal and his current family. pic.twitter.com/KExVBl6wwY