అన్వేషించండి

Bihar Assembly Elections: యూట్యూబ్‌లో కోటి మంది ఫాలోయర్లు - కానీ ఎన్నికల్లో ఘోర ఓటమి - పాపం బీహారీ బాయ్ మనీష్ కశ్యప్

Manish Kashyap: బీహార్ యువతలో ప్రత్యేక గుర్తింపు .. యూట్యూబ్‌లో 9.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నా.. యూట్యూబర్ మనీష్ కశ్యప్‌కు చాన్‌పటియా ఓడిపోయారు అది కూడా 50,366 ఓట్ల తేడాతో.

Social media star Manish Kashyap loses badly : బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025లో ఎన్‌డీఏ  భారీ విజయం సాధించింది.   యూట్యూబ్ సెన్సేషన్ మనీష్ కశ్యప్‌ మాత్రం ఘోరంగా ఓడిపోయారు. ఆయనకు యూట్యూబ్‌లో 9.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.  మనీష్, పశ్చిమ చంపారణ్ జిల్లా చాన్‌పటియా నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ జన సూర్య పార్టీ (జేఎస్‌పీ) టికెట్‌పై పోటీపడ్డారు. కానీ, కేవలం 37,172 ఓట్లు మాత్రమే పొంది, విజేత కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్‌కు 50,366 ఓట్ల తేడాతో ఓడిపోయారు.   యూట్యూబ్ పాపులారిటీ ఎన్నికల్లో పనిచేయలేదు 
   
కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ మరో వైపు బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్‌ను కేవలం 602 ఓట్ల తేడాతో ఓడించారు. మనీష్ కశ్యప్ మూడో స్థానంలో నిలిచారు,.  మనీష్ పొందిన 37,172 ఓట్లు ఆయన యూట్యూబ్ ఫాలోయింగ్ తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. మనీష్ కశ్యప్ అసలు పేరు త్రిపురాలి కుమార్ తివారి. యూట్యూబ్‌లో 'బీహారీ బాయ్'గా ప్రసిద్ధి చెందారు. బీహార్ పాలిటిక్స్, సామాజిక సమస్యలు, యూత్ ఇష్యూస్‌పై వీడియోలు చేస్తూ 9.6 మిలియన్ సబ్‌స్క్రైబర్లు, 1.5 బిలియన్ వ్యూస్ పొందారు. 2024లో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్   పార్టీలో చేరి, చాన్‌పటియా నుంచి పోటీపడ్డారు. ప్రచారంలో "బీహార్ మార్పు కావాలి" స్లోగన్‌తో యూవీ ఓటర్లను ఆకర్షించారు.
 
మనీష్ కశ్యప్ 1994లో పశ్చిమ చంపారణ్ జిల్లా బెత్తియా సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న మనీష్, బీఏ పూర్తి చేసి జర్నలిజం చేయాలనుకున్నారు. 2018లో యూట్యూబ్ ఛానల్ 'మనీష్ కశ్యప్' ప్రారంభించారు.బీహార్ గ్రామీణ సమస్యలు – రోడ్లు లేకపోవడం, విద్యుత్ కట్‌లు, ఉపాధి లేకపోవడం వంటి వాటిపై  సాధారణ భాషలో, లైవ్ రిపోర్టింగ్‌తో ఆకర్షణ పెంచారు.  2019లో బీహార్ ఫ్లడ్స్ సమయంలో గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు.  "బీహార్ బాయ్" అనే ట్యాగ్‌తో వీడియోలు వైరల్. 2020 నాటికి 1 మిలియన్ సబ్‌స్క్రైబర్లు. మార్చి 2023లో తమిళనాడులో బీహార్ మైగ్రెంట్ లేబరర్స్ పై దాడులు జరుగుతున్నాయని..తమిళనాడులో బీహారీలను కొట్టి చంపుతున్నారు" అని వీడియోలు పోస్ట్ చేశారు. బీహార్‌లో ఆందోళనలు, రాజకీయ పార్టీలు రియాక్ట్ అయ్యారు.  నీతీష్ కుమార్ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశారు. మనీష్ ఛానల్ సబ్‌స్క్రైబర్లు 3 మిలియన్ నుంచి 9.6 మిలియన్‌కు  పెరిగాయి.  తర్వాత తమిళనాడు పోలీసులు "ఇది ఫేక్ న్యూస్" అని ప్రకటించారు.  తమిళనాడు పోలీసులు మనీష్ పై NSA   కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు.  బీహార్ పోలీసులు కూడా ఫేక్ న్యూస్ కేసులు పెట్టారు. 45 రోజులు జైలులో ఉండి రిలీజయ్యారు.   

 
ఫిబ్రవరి 2024లో బీజేపీలో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బెత్తియా లేదా వాల్మీకినగర్ సీటు కోరారు, కానీ బీజేపీ ఇవ్వలేదు. మార్చి 2024లో ప్రశాంత్ కిషోర్ జన  సురాజ్  పార్టీలో చేరారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో చాన్‌పటియా నుంచి టికెట్ పొందారు. ఎన్నికల్లో 37,172 ఓట్లు పొంది మూడో స్థానంలో నిలిచారు.  ప్రశాంత్ కిషోర్ పార్టీ మొత్తం 238 సీట్లకు పోటీ చేసినా ఒక్క సీటూ గెలవలేదు. మనీష్ ఓటమి "యూట్యూబ్ పాపులారిటీ ఎన్నికల్లో పనిచేయదు" అనే సందేశాన్ని ఇచ్చింది. ఆయన ఎక్స్‌లో "ఓటమి మాకు పాఠం, మార్పు కొనసాగుతుంది" అని పోస్ట్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
MSD Rahane Secrets: ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
CoE Fitness Overhaul: ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget