Bihar Assembly Elections Jansuraj Party : యువత, ఈబీసీల ఓట్లు చీల్చిన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ - మహాకూటమి ఓటమిలో కీలక పాత్ర
Bihar Janasuraj Party: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ మహాఘట్‌బంధన్ అవకాశాలను దెబ్బతీసింది. జేఎస్పీ అభ్యర్థులు చీల్చిన ఓట్ల కారణంగా పలువురు ఓటమి పాలయ్యారు.

Janasuraj Party damages Mahaghatbandhan chances in Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల 2025లో ఎన్‌డీఏ భారీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారంలోకి రావడం ఖాయమైంది. 243 సీట్ల అసెంబ్లీలో ఎన్‌డీఏ 200కి పైగా సీట్లు గెలుచుకుని 'డబుల్ సెంచరీ' సాధించగా, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమి కేవలం 40 సీట్లకు పరిమితమయింది. ఇంత ఘోరంగా ఓడిపోవడంలో ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ప్రభావం కీలకంగా కనిపిస్తోంది. మొదటి ఎన్నికల్లోనే 238 సీట్లకు పోటీపడిన జనసురాజ్ ఒక్క సీటూ గెలవకపోయినా, దాని 3-4% ఓటు షేర్ ఆర్జేడీ కూటమి అవకాశాలను గణనీయంగా దెబ్బతీసింది. ఇది ప్రధానంగా యువత, ఓబీసీలు, కుల ఓట్లను విభజించి, ఎన్‌డీఏకు పరోక్షంగా లాభం చేకూర్చింది.
జనసురాజ్ ప్రదర్శన 238 సీట్లలో పోటీ చేసింది. మొత్తం 243లో 5 సీట్లలో మాత్రమే పోటీ చేలేదు. మొత్తం ఓటు షేర్ 3-4% మధ్య ఉంటుంది. 40కి పైగా నియోజకవర్గాల్లో పది వేలకుపైగా ఓట్లను ఆ పార్టీ అభ్యర్థులు సాధించారు. ఇవి ప్రధానంగా ఆర్జేడీ బలమైన ఉత్తర్ బీహార్, మగధ్ ప్రాంతాల్లో ఉననాయి. కానీఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయారు. 68 నియోజకవర్గాల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ కొన్ని స్వల్ప ఓట్లు కూడా కూటమి అవకాశాలను దెబ్బతీశాయి.
జనసురాజ్ ప్రధానంగా "మార్పు" స్లోగన్‌తో యువత, ఓబీసీలు, ఈబీసీల ఓట్లను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఆర్జేడీ యాదవ్-ముస్లిం కోర్ ఓటు బ్యాంకును 5-10 శాతం వరకు కోతపెట్టింది. ఫలితంగా, మహాఘట్ బంధన్ ఓటు షేర్ 2020లో 37 శాతం నుంచి 30 శాతానికి పడిపోయింది. ప్రశాంత్ కిషోర్ జేడీయూ-నితీష్‌ను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, జనసురాజ్ ఓట్లు ప్రధానంగా ఆర్జేడీ నుంచే వచ్చాయి, ఎన్‌డీఏకు పరోక్ష సహాయం చేశాయి.
చేరియా బరియార్‌పూర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి సుశీల్ కుమార్ ఓడిపోయారు. జనసురాజ్ 12-15% ఓట్లు తీసుకుని, ఆర్జేడీ ఓటమికి కారణం అయింది. షెర్‌ఘాటీలో ఆర్జేడీ అభ్యర్థి ప్రమోద్ వర్మా ఓటమి పాలయ్యారు. జనసురాజ్ యువ ఓట్లు చీల్చడంతో ఆయన పరాజం పాలయ్యారు. జోకిహట్ లో మజ్లిస్ గెలిచింది. ఇక్కడ జనసురాజ్ చీల్చిన ఓట్లు కీలకం. ఇవి మాత్రమే కాదు, మగధ్, షేకహ్వాలీ ప్రాంతాల్లో 10-15 నియోజకవర్గాల్లో జనసురాజ్ మూడో,నాల్గో స్థానంలో నిలిచి, ఆర్జేడీ మార్జిన్‌లను 5-7 శాతం తగ్గించింది. సీమాంచల్‌లో మజ్లిస్ తో పాటు జనసురాజ్.. మహాకూటమి ఫలితాలను మార్చేసింది.
జనసురాజ్ 'ఎంప్లాయ్‌మెంట్, కరప్షన్ ఫ్రీ బీహార్' స్లోగన్‌లతో 18-35 ఏళ్ల యువతను ఆకర్షించింది. ఆర్జేడీ యువ యాదవ్ ఓట్లు 10 శాతం వరకు కోల్పోయింది. ప్రశాంత్ కిషోర్ కుల రహిత వాదన చేసినా, ఓబీసీ-ఈబీసీల్లో ఆర్జేడీ ఓట్లు బదిలీ అయ్యాయి. ఇది మహాకూటమి బలహీనపరిచింది. 3,000 కి.మీ. పాదయాత్ర చేసినా, క్యాండిడేట్లకు గుర్తింపు లేకపోవడం వల్ల ఓట్లు కేంద్రీకరించలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ 1-5 సీట్లు అంచనా వేసినా, రియల్‌టీలో ఆర్జేడీ, కాంగ్రెస్ ఓటమికి మాత్రమే ఉపయోగపడింది.





















