News
News
X

Twist In Shraddha Murder Case: 'ముక్కలుగా నరికేస్తానని బెదిరిస్తున్నాడు'- 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు!

Twist In Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. అఫ్తాబ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నట్లు ఆమె 2020లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

FOLLOW US: 
 
Twist In Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా హత్య కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. అఫ్తాబ్ త‌న‌ను న‌రికి చంపుతాన‌ని బెదిరిస్తున్న‌ట్లు 2020లోనే శ్ర‌ద్ధా పోలీసుల‌కు లేఖ రాసింది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు

మ‌హారాష్ట్ర‌లోని త‌న సొంత గ్రామ‌మైన వాసాయిలోని తిలుంజ్ పోలీసుల‌కు శ్రద్ధా ఈ లేఖ రాసింది. ఇద్ద‌రూ క‌లిసి ఉంటున్న ఫ్లాట్‌లో త‌న‌పై అఫ్తాబ్ దాడి చేసిన‌ట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. అఫ్తాబ్ కుటుంబానికి అత‌ని ప్ర‌వ‌ర్త‌న గురించి తెలిసిన‌ట్లు కూడా శ్రద్ధా చెప్పింది.ం

News Reels

" గొంతు నొక్కి చంపేందుకు ప్ర‌య‌త్నించాడు. చంపేస్తాన‌ని, ముక్క‌లుగా న‌రికేస్తాన‌ని బెదిరిస్తున్నాడు. ఆరు నెలల నుంచి అత‌ను కొడుతూనే ఉన్నాడు. అతని ప్రవర్తన గురించి వాళ్ల కుటుంబానికి కూడా తెలుసు. కానీ పోలీసుల వ‌ద్ద‌కు వెళ్లేందుకు నాకు ధైర్యం రావ‌డం లేదు.                                    "
-      శ్రద్ధా

అయితే కొన్ని రోజుల త‌ర్వాత త‌మ మ‌ధ్య విబేధాలు లేవ‌ని స్థానిక పోలీసుల‌కు ఆ జంట మ‌రో స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 

త‌న స‌హ ఉద్యోగి క‌ర‌ణ్‌కు కూడా అఫ్తాబ్ బెదిరింపుల గురించి 2020, న‌వంబ‌ర్ 23న శ్ర‌ద్ధా వాట్సాప్ మెసేజ్ చేసింది. గాయమైన ముఖం ఫోటోల‌ను కూడా ఆమె అత‌నికి పోస్టు చేసింది. తీవ్రంగా గాయాలు కావ‌డంతో కొన్ని రోజులు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంది.

ఇదీ కేసు

అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.

కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అఫ్తాబ్‌పై అనుమానం

తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.

అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.

దర్యాప్తులో

అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది. 

Also Read: UP Municipal Polls: 'మమ్మల్ని గెలిపిస్తే మేరఠ్ నగరానికి గాడ్సే పేరు పెట్టేస్తాం' 

Published at : 23 Nov 2022 03:53 PM (IST) Tags: Aftab Tried To Killed Me Shraddha's Old Police Complaint

సంబంధిత కథనాలు

Gold-Silver Price 08 December 2022: మళ్లీ ₹54 వేలకు చేరిన బంగారం ధర, పెళ్లిళ్ల ఎఫెక్ట్‌ మామూలుగా లేదు

Gold-Silver Price 08 December 2022: మళ్లీ ₹54 వేలకు చేరిన బంగారం ధర, పెళ్లిళ్ల ఎఫెక్ట్‌ మామూలుగా లేదు

Petrol-Diesel Price, 08 December 2022: అనంతపురం, ఆదిలాబాద్‌లో భారీగా పెరిగిన చమురు ధర, మిగిలిన ప్రాంతాల్లోనూ మోతెక్కిపోతోంది

Petrol-Diesel Price, 08 December 2022: అనంతపురం, ఆదిలాబాద్‌లో భారీగా పెరిగిన చమురు ధర, మిగిలిన ప్రాంతాల్లోనూ మోతెక్కిపోతోంది

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

TS Polytechnic Lecturers పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఖాళీల వివరాలు ఇలా! దరఖాస్తు తేదీలివే!

SSC CHSL Results 2020: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2020 తుది ఫలితాలు విడుదల, 4685 మందికి ఉద్యోగాలు!

SSC CHSL Results 2020: సీహెచ్‌ఎస్‌ఎల్‌-2020 తుది ఫలితాలు విడుదల, 4685 మందికి ఉద్యోగాలు!

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

టాప్ స్టోరీస్

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ - ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

Chandrababu Ring : చంద్రబాబు చేతి ఉంగరమే ఓ పెద్ద డాక్టర్ -  ఆ రింగ్ స్పెషాలిటీ ఏమిటో తెలుసా ?

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Ind vs Ban, 2nd ODI: అయిపాయె - బంగ్లాదేశ్ మీద కూడా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్!

Bandi Sanjay: లిక్కర్ స్కామ్ కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది, డ్రగ్స్ కేసులు రీఓపెన్ చేస్తే ఖేల్ కతం: బండి సంజయ్

Bandi Sanjay: లిక్కర్ స్కామ్ కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది, డ్రగ్స్ కేసులు రీఓపెన్ చేస్తే ఖేల్ కతం: బండి సంజయ్