Shiv Sena Symbol Crisis: ఎన్నికల కమిషన్‌కు మూడు గుర్తులు పంపిన ఏక్‌నాథ్ శిందే!
Shiv Sena Symbol Crisis: ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన వర్గం ఎన్నికల కమిషన్‌కు ఎలక్షన్ కోసం మూడు గుర్తులను ఎంపిక చేసి పంపింది.
Shiv Sena Symbol Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన కూటమి.. ఎన్నికల కమిషన్‌కు మరో మూడు గుర్తులను ఎంపిక చేసి పంపింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్ శిందే వర్గాలు అసలైన శివసేన మాదంటే మాది అంటూ ఆందోళన చేస్తున్నాయి.
ఈ నెలలో అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు శివసేన ఎన్నికల గుర్తు విల్లు-బాణం గుర్తును తమకే కేటాయించాలని ఇరువర్గాలు ఎన్నికల కమిషన్‌ను కోరాయి. దీంతో ఈసీ పార్టీ పేరుతోపాటు ఎన్నికల గుర్తును ఇరువర్గాలు వాడకుండా ఫ్రీజ్ చేసింది.
కాగడా గుర్తు
అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింంది. శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శిబిరాలు తమకు నచ్చిన మూడు ప్రత్యామ్నాయ చిహ్నాలు, పేర్లను ఎన్నికల సంఘానికి ఆదివారం సమర్పించాయి. ఈ చిహ్నాలను మరే ఇతర పార్టీ అయినా ఉపయోగిస్తోందా లేదా అని ఎన్నికల సంఘం పరిశీలించింది. ఈ చిహ్నాల వాడకాన్ని నిషేధించారా లేదా అని కూడా కమిషన్ చూసింది. ఓ ఎన్నికల సంఘ మాజీ అధికారి మాట్లాడుతూ "చిహ్నాన్ని కేటాయించడం కమిషన్ ప్రత్యేక హక్కు. ఇలాంటి టైంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వద్ద అందుబాటులో ఉన్న స్వతంత్ర చిహ్నాల జాబితాలో చేర్చని చిహ్నాన్ని కమిషన్ (కమిషన్) కేటాయించవచ్చు. అని అన్నారు.
ఉద్ధవ్ వర్గం ఇచ్చిన చిహ్నాలు
ఉపఎన్నికల్లో తమకు త్రిశూల్, మాషాల్(మ), ఉదయించే సూర్యుడు అనే మూడు చిహ్నాల్లో ఒక చిహ్నం, పేరును కేటాయించాలని ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం కమిషన్‌కు రిక్వస్ట్ చేశారు. శిందే శిబిరానికి మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా ఉపఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 14. అటువంటి పరిస్థితిలో రెండు శిబిరాల ప్రత్యామ్నాయ చిహ్నాలు, పేర్లపై కమిషన్ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును కేటాయించింది.
శివసేన పార్టీ పేరును, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేయడంపై న్యాయపోరాటానికి దిగింది ఠాక్రే వర్గం. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఇలా జరిగింది
అసలైన శివసేన తమదే అని నిరూపిస్తూ ఆగస్టు 8లోగా డాక్యుమెంటరీలు సమర్పించాలని గతంలోనే ఈసీ రెండు వర్గాలను ఆదేశించింది. అయితే ఠాక్రే వర్గం అభ్యర్థనతో గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అయితే, ఉప ఎన్నికల్లో పోటీ కోసం తమకు శివసేన విల్లు బాణం గుర్తు కేటాయించాలని శిందే వర్గం ఈసీని అభ్యర్థించింది.
దీంతో శిందే వర్గం అభ్యర్థనపై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని కోరింది. ఈ క్రమంలో ఉద్దవ్ వర్గం శనివారమే ఈసీకి తమమ స్పందన తెలియజేసింది. శిందే వర్గం డాక్యుమెంటేషన్ క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలని కోరింది. తర్వాత విచారించి విల్లు, బాణం గుర్తును ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంంది.
Also Read: Russia Ukraine War: అమెరికా సాయం- ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ!