Sharad Pawar: అదానీ వ్యవహారంపై విచారణ అనవసరం, ఆ కమిటీలో అంతా బీజేపీ వాళ్లే - శరద్ పవార్
Sharad Pawar: అదానీ వ్యవహారంపై జేపీసీ నియమించాలన్న డిమాండ్‌ను శరద్ పవార్ తోసిపుచ్చారు.
Sharad Pawar on Adani Group:
జేపీసీ డిమాండ్‌ను తిరస్కరించిన పవార్
అదానీ వ్యవహారంపై దాదాపు నెల రోజులుగా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హిండన్‌బర్గ్ రిపోర్ట్‌లో ఉన్నవన్నీ నిజాలే అని, కేంద్రం దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. అంతే కాదు. ఈ స్కామ్‌పై పూర్తి స్థాయి విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనూ నల్ల దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. దీనిపై మిగతా పార్టీలనూ కలుపుకుని పోరాటం చేస్తోంది. ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీని టార్గెట్ చేసుకుని కావాలనే ఆ రిపోర్ట్ విడుదల చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
"గతంలో మేం అధికారిక ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో పదేపదే టాటా బిర్లా పేర్లు ప్రస్తావించేవాళ్లం. అలా అని వాళ్లు ఈ దేశానికి చేసిన సేవల్ని తప్పు పట్టలేం కదా. ఇప్పుడు అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కూడా దేశానికి ఏం చేశారన్నది ఓ సారి పరిశీలించాలి"
- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత
అదానీ వ్యవహారంపై విపక్షాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న డిమాండ్‌నూ తోసిపుచ్చారు పవార్. ఆ కమిటీ ద్వారా నిజాలేవీ బయటకు రావని తేల్చి చెప్పారు.
"ఇప్పటికే చాలా సార్లు మా మీటింగ్‌లో నేను చెప్పాను. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసినా వృథాయే. ఆ కమిటీలో 21 మంది సభ్యులుంటే...అందులో 15 మంది బీజేపీ వాళ్లే ఉన్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు వస్తాయని నేను అనుకోవడం లేదు. అందుకే నేను ఓ సూచన చేశాను. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఓ స్వతంత్ర కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చెప్పాను"
- శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత
#WATCH एक जमाना ऐसा था जब सत्ताधारी पार्टी की आलोचना करनी होती थी तो हम टाटा-बिड़ला का नाम लेते थे। टाटा का देश में योगदान है। आजकल अंबानी-अडानी का नाम लेते हैं, उनका देश में क्या योगदान है, इस बारे में सोचने की आवश्यकता है: अडानी मुद्दे पर NCP प्रमुख शरद पवार pic.twitter.com/Xt5De9dpwR
— ANI_HindiNews (@AHindinews) April 8, 2023
మొదటి నుంచి తాను JPC డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు శరద్ పవార్. బీజేపీ వాళ్లతో నిండిపోయిన ఆ కమిటీతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదని స్పష్టం చేశారు. ఒకవేళ విచారణ జరిపినా...అది అధికార ప్రభుత్వానికి అనుకూలంగానే నివేదిక ఇస్తుందని తేల్చి చెప్పారు.
Also Read: CRPF Recruitment: సీఆర్‌పీఎఫ్‌లో 1.30 లక్షల ఉద్యోగాలు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల!