అన్వేషించండి

Shah Rukh Khan: కస్టమ్స్ డ్యూటీ చెల్లించని షారుఖ్? కట్టాల్సిందేనని పట్టుపట్టిన కస్టమ్స్ అధికారులు

Shah Rukh Khan: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో షారుఖ్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది.

Shah Rukh Khan stopped at Airport:

దుబాయ్ నుంచి ముంబయికి..

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఆయనను, ఆయన టీమ్‌ని కస్టమ్స్ అధికారులు ఆపారు. దాదాపు గంటసేపు విచారించి తరవాత వదిలేశారు. షారుఖ్ ఖాన్, ఆయన మేనేజర్ పూజ దడ్లానీ ఎయిర్‌పోర్ట్ నుంచి దాదాపు గంట తరవాత బయటకు వచ్చారు. కానీ...బాడీగార్డ్ రవితో పాటు షారుఖ్ ఖాన్ టీమ్‌ని ఆపేశారు కస్టమ్స్ అధికారులు. లక్షల రూపాయల విలువైన వాచ్‌లను షారుఖ్ తీసుకొచ్చారని, వాటికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదని అధికారులు వివరించారు. షారుఖ్‌ను అందుకే విచారించామని వెల్లడించారు. ఓ బుక్ లాంచ్‌ కోసం షారుఖ్ ఖాన్ తన టీమ్‌తో కలిసి ఓ ప్రైవేట్ చార్టర్‌లో దుబాయ్‌కు వెళ్లారు. ముంబయికి శుక్రవారం అర్ధరాత్రి తిరిగి వచ్చారు. రెడ్ ఛానల్‌ను దాటే సమయంలో వాళ్ల బ్యాగ్స్‌లో లక్షల రూపాయల విలువ చేసే వాచ్‌లను కస్టమ్స్ అధికారులు గమనించారు. వెంటనే అందరినీ ఆపి బ్యాగ్‌లు చెక్ చేశారు. విచారణలో భాగంగా ఎన్నో విలువైన వాచ్‌లను గుర్తించారు. 

రూ.కోట్ల విలువైన వాచ్‌లు

Babun & Zurbk వాచ్‌లతో పాటు 6 బాక్సుల రోలెక్స్ వాచ్‌లు, స్పిరిట్ బ్రాండ్ వాచ్‌లు ఆ బ్యాగ్‌లలో ఉన్నాయి. వీటితో పాటు యాపిల్ సిరీస్ వాచ్‌లనూ గుర్తించారు. వీటి విలువను లెక్కించిన అధికారులు పన్ను రూపంలో రూ.17 లక్షల 60 వేల 500 చెల్లించాలని చెప్పారు. కోట్ల రూపాయల విలువ చేసే వాచ్‌లపై లక్షల రూపాయల పన్నులేంటి అని కాసేపు వాళ్ల మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఓ గంట సేపు విచారణ తరవాత షారుఖ్ ఖాన్, ఆయన మేనేజర్ పూజ దడ్లాని బయటకు వచ్చారు. కానీ...బాడీగార్డ్ రవితో పాటు టీం అంతా అక్కడే ఉండి పోయారు. అయితే..షారుఖ్ టీం కస్టమ్స్ అధికారులతో మాట్లాడింది. ఈ వాచ్‌ల విలువ రూ.18 లక్షలు మాత్రమేనని వివరించింది. 
వీటిపై రూ.6.83 వేల కస్టమ్స్ పన్నుని చెల్లించేందుకు అంగీకరించింది. షారుఖ్ బాడీగార్డ్ రవి పేరిటే బిల్‌ ఇచ్చినప్పటికీ...ఖాన్ క్రెడిట్ కార్డ్‌తోనే డబ్బు కట్టినట్టు తెలుస్తోంది. ఈ బిల్ చెల్లించాక ఉదయం 8 గంటలకు టీమ్‌ని విడిచిపెట్టారు కస్టమ్స్ అధికారులు. అయితే...షారుఖ్ ఖాన్ కస్టమ్స్ పన్ను కట్టకుండానే అధికారులు ఆయన బయటకు వెళ్లిపోవటానికి ఎలా అనుమతినిచ్చారన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. అంతే కాదు. షారుఖ్ పేరు మీద కాకుండా ఆయన బాడీగార్డ్ రవి పేరుపై బిల్‌ ఎందుకు ఇచ్చారని కొందరు వాదిస్తున్నారు. ఒకవేళ ఆ వాచ్‌లు బాడీగార్డ్‌వే అయితే...వాటిపై కస్టమ్స్ డ్యూటీని షారుఖ్ ఎందుకు కట్టాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. వీటిని దుబాయ్ నుంచి స్మగుల్ చేసి తీసుకొచ్చారా అన్న వాదనా వినిపిస్తోంది. ఏదేమైనా...స్టార్ హీరో కనుక ఈ మాత్రం ఆసక్తి ఉండకపోదు. అధికారులు స్వయంగా వచ్చి వివరిస్తే తప్ప లోపల ఏం జరిగిందన్నది స్పష్టత రాదు. 

Also Read: Patanjali Drugs Ban: పతంజలికి షాక్ ఇచ్చిన అధికారులు, ఆ మందులపై నిషేధం

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ABP Desam Top 10, 8 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 8 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget