By: Ram Manohar | Updated at : 07 Jul 2022 11:10 AM (IST)
శివసేన ఎంపీలు కూడా సీఎం శిందే శిబిరంలోకి వెళ్లిపోతారా..?
ఎంపీలు కూడా జంప్ అవుతారా..?
మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందే వైపు వెళ్లిపోవటం, ఆ తరవాత మారిన పరిణామాలతో శిందే సీఎం అవటం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి శివసేన ఎంపీలపైనా పడింది. దాదాపు 18 మంది శివసేన ఎంపీల్లో కొందరు ఏక్‌నాథ్ శిందే వైపు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఓ శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చు తున్నాయి. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతు ఇవ్వాలని ఉద్దవ్ ఠాక్రేకు వినతి పంపారు ఆ ఎంపీ. ఇది కాస్తా పెద్ద చర్చకే దారి తీసింది. అంతే కాదు. ఏ రెబల్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కూడా శిందే తదుపరి లక్ష్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నాయి. శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో కనీసం 12 మంది సీఎం శిందే వైపు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని, రెబల్ ఎమ్మెల్యే గులాబ్‌రావ్ పాటిల్ అన్నారు. నలుగురు ఎంపీలను నేరుగా కలిసి ఈ విషయమై చర్చించాననీ చెప్పారు. 22 మంది మాజీ ఎమ్మెల్యేలూ కూడా తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతునివ్వండి..
శివసేన ఎంపీ రాహుల్ శెవాలే ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. గిరిజన మూలాలున్న నేత ద్రౌపది ముర్ముకి మద్దతుగా నిలవాలని కోరారు. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. పార్టీలకు అతీతంగా ఆయన యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థులైన ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీకి మద్దతునిచ్చారని గుర్తు చేశారు. అయితే వీరికి ఎన్నికల భయం పట్టుకోవటం వల్లే ఎన్‌డీఏకి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్థానికంగా ఎమ్మెల్యేల మద్దతు లేకుండా రానున్న ఎన్నికల్లో గెలవటం అసాధ్యం. అందుకే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చి, కాస్తో కూస్తో తమ విజయావకాశాలను పెంచుకోవాలని చూస్తున్నారన్న విశ్లేషణలున్నాయి.
శివసేన వీరినైనా కాపాడుకుంటుందా..?
నిజానికి 2019లో ఎన్నికల బరిలోకి దిగినప్పుడు శివసేన-భాజపా కూటమిగా ఉంది. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వేవ్ కారణంగా 48 సీట్లలో 18 స్థానాలు గెలుచుకుంది ఈ కూటమి. ఈ సారి భాజపాతో వైరం పెరగటం వల్ల ఆ కొన్ని స్థానాలు కూడా శివసేనకు రావటం కష్టమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు ఎంపీలు కూడా అభద్రతా భావంతో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శిందే శిబిరంలోకి వెళ్లిపోవాలని చూస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో స్పష్టత అయితే రాలేదు. కనీసం ఎంపీలనైనా శివసేన బుజ్జగించి కాపాడుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.
Nellore News : అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య
Noida Twin Towers : 40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?
AP Govt Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈహెచ్ఎస్ కార్డుతో వేరే రాష్ట్రాల్లో ట్రీట్మెంట్
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?
Minister Harish Rao : మహిళలకు కొత్తగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వచ్చే నెల నుంచి ప్రారంభం- మంత్రి హరీశ్ రావు
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!
64 మెగాపిక్సెల్ కెమెరాతో 5జీ ఫోన్ - లాంచ్ చేసిన టెక్నో!