Mining Lease Case: సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
Mining Lease Case: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు మైనింగ్ కుంభకోణం కేసులో ఊరట లభించింది.
![Mining Lease Case: సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ SC sets aside Jharkhand HC order on mining lease case relief to Hemant Soren Mining Lease Case: సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/07/55b4d00beac3d45bc6c1777f58cc15ab1667815157258218_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mining Lease Case: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సొరేన్‌తో పాటు ఝార్ఖండ్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీం అంగీకరించింది.
మైనింగ్ కుంభకోణం కేసులో సొరేన్‌పై విచారణ కోసం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని ఝార్ఖండ్ హైకోర్టు ఇటీవల సమర్థించింది. అయితే ఈ ఆదేశాలు చెల్లవని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది.
సత్యమేవ జయతే
सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq
— Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022
సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన కాసేపటికే సీఎం హేమంత్ సొరేన్ 'సత్యమేవ జయతే' అంటూ ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు.
సీఎం సీరియస్
మైనింగ్ కేసులో తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై సీఎం హేమంత్ సొరేన్ ఇటీవల ఘాటుగా స్పందించారు. ఒక గిరిజన ముఖ్యమంత్రిని వేధించే పన్నాగంలో ఇదంతా భాగమని ఆయన ఆరోపించారు.
రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో గత గురువారం హాజరుకావాలని సోరెన్‌ను ఈడీ కోరింది. అయినప్పటికీ సీఎం హాజరు కాలేదు. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఎం హేమంత్ సొరేన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.
Also Read: Imran Khan: 'యాక్టింగ్‌లో షారూక్ ఖాన్‌ను మించిపోయారు'- ఇమ్రాన్ ఖాన్‌పై సెటైర్లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)