News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Imran Khan: 'యాక్టింగ్‌లో షారూక్ ఖాన్‌ను మించిపోయారు'- ఇమ్రాన్‌ ఖాన్‌పై సెటైర్లు

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌పై జరిగిన దాడి మొత్తం ఓ డ్రామా అని పాకిస్థాన్‌లోని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన ఘటనపై అక్కడి రాజకీయ పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌పై జరిగిన దాడి మొత్తం ఒక డ్రామాగా అభివర్ణిస్తున్నాయి.

" ఇమ్రాన్‌పై జరిగిన దాడి ఓ డ్రామా. ఇమ్రాన్‌ ఖాన్ యాక్టింగ్‌లో సల్మాన్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లను మించిపోయారు. ఇమ్రాన్‌ డ్రామా చేస్తున్నట్లు అనిపిస్తోంది. అసలు ఇమ్రాన్‌పై ఎన్ని తూటాలు కాల్చారు. ఎన్ని చోట్ల గాయాలయ్యాయి అన్న అంశాలను స్పష్టంగా చెప్పాలి. అయినా దాడి జరిగిన వెంటనే ఇమ్రాన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించకుండా లాహోర్‌కు తీసుకువెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. "
-              మౌలాన ఫజ్లూర్‌ రెహ్మాన్‌, పాకిస్థాన్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ అధినేత 

ఇదీ జరిగింది

దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలంటూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, ఇమ్రాన్‌ ఖాన్‌ లాంగ్‌మార్చ్‌ పేరిట ర్యాలీ చేపట్టారు. గురువారం లాంగ్‌ మార్చ్‌  వజీరాబాద్‌లో అల్లాహో చౌక్‌కు చేరుకోగా ఇమ్రాన్‌ ఖాన్‌ కంటెయినర్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ర్యాలీలో ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఇమ్రాన్‌ కంటెయినర్‌ పైకి ఎక్కి నిలబడిన సమయంలో జరిపిన ఈ కాల్పుల్లో ఆయన కాలికి గాయాలైనట్టు పీటీఐ నేత ఫవాద్‌ చౌధురి వెల్లడించారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.  పీటీఐకి చెందిన దాదాపు నలుగురు నాయకులు ఈ కాల్పుల్లో గాయపడ్డారు.

నిజానికి ఈ మార్చ్‌పై దాడి జరిగే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి. అయినా దాడి జరిగింది. మరోసారి ప్రధాని కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్‌పై అటాక్ జరగటం అక్కడ సంచలనమైంది. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు...విచారణ జరిపారు. ఈ విచారణలో...తాను ఇమ్రాన్‌ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చానని అంగీకరించాడు నిందితుడు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని అందుకే చంపాలనుకున్నానని వివరించాడు.    

నిజానికి...ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటంలో కొంత మేర సక్సెస్ అయ్యారు ఇమ్రాన్ ఖాన్. ఈ ఉద్యమం పీక్స్‌లో ఉందనగా ఆయనపై దాడి జరిగింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని సింపథీ కోసం ప్రయత్నించే అవకాశముంది. అంతే కాదు...షహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతుని కూడగట్టుకునేందుకూ ప్రయత్నించవచ్చు. ఇక ఇమ్రాన్ మద్దతుదారులు దేశంలో అలజడి సృష్టిస్తే ప్రచ్ఛన్న యుద్ధమూ తప్పదు. లేదంటే...షహబాజ్ చేతులు ఎత్తేసి పూర్తి అధికారాలను సైన్యానికి అప్పగించవచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా...పాకిస్థాన్ కథ మళ్లీ మొదటికే వస్తుంది. ఈ మధ్యే FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడ్డ ఆ దేశానికి...ప్రస్తుత పరిణామాలు పెద్ద దెబ్బే అవుతుండొచ్చు. పదేపదే సైన్యాన్ని తప్పు పడుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ను అణిచివేసేందుకు...షహబాజ్ ప్రభుత్వం ఆ సైన్యాన్నే అడ్డు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రస్తుత దాడితో ఇమ్రాన్‌ ఖాన్‌కు సింపథీ అయితే దక్కుతుంది. ఇది భవిష్యత్‌లో ఆయనకు రాజకీయంగా మంచి మైలేజ్ ఇచ్చే అంశమే. మరో వారం పది రోజుల్లో పాకిస్థాన్‌లో రాజకీయాలు ఎలా మారతాయో గమనించాలి. 

Also Read: Uttar Pradesh News: కర్రలు, పైపులతో మహిళలపై పోలీసుల దాడి- వైరల్ వీడియో!

Published at : 07 Nov 2022 02:51 PM (IST) Tags: salman khan Imran Khan Shah Rukh Khan Pak Leaders

ఇవి కూడా చూడండి

Telangana Polling 2023 LIVE Updates:  తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!

Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన

Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్

ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం

Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

Telangana Exit Poll 2023 Highlights :   ఏబీపీ  సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ -  తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !

ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు

ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు

Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!

Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!