Viral Death: వేల కోట్ల ఆస్తి ఉన్నా ఈగకి లోకువే - తేనెటీగ నోట్లోకి వెళ్లడంతో చనిపోయిన కరిష్మా కపూర్ మాజీ భర్త
Sanjay Kapur: బాలీవుడ్ మాజీ హీరోయిన్ కరిష్మాకపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఓ తేనేటీగ నోట్లో దూరడం వల్ల చనిపోయారు. ఆయన మరణం విధానం సంచలనాత్మకంగా మారింది.

Sanjay Kapur dies in England: నోట్లోకి ఈగలు వెళ్తే చనిపోతామా ?. సాధారణంగా చనిపోకపోవచ్చు.. ఆ ఈగను ఊసేస్తాం. ఊసేయలేనంత లోపలికి వెళ్తే మింగేస్తాం..దాని వల్ల పెద్దగా సమస్యలు రావు. కానీ ఆ ఈగ ఎక్కడైతే శ్వాసకు ప్రాబ్లం వస్తుందో అక్కడే ఇరుక్కుపోతే..చచ్చిపోతాం. శ్వాస ప్రక్రియకు విఘాతం కల్పిస్తే గుండెపోటు వస్తుంది. కోటికో.. వంద కోట్లకో ఒలా జరుగుతుందేమో..సంజయ్ కపూర్. బాలీవుడ్ మాజీ హీరోయిన్ కరిష్మాకపూర్ మాజీ భర్త.
సంజయ్ కపూర్, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు సోనా కామ్‌స్టార్ ఛైర్మన్, 2025 జూన్ 12న ఇంగ్లాండ్‌లోని విండ్సర్‌లో గార్డ్స్ పోలో క్లబ్‌లో పోలో మ్యాచ్ ఆడుతుండగా మరణించారు. ఆయన వయసు 53 ఏళ్లు మాత్రమే. ఆయన మరణానికి కారణం గుండెపోటు (heart attack) అని సోనా కామ్‌స్టార్ ప్రకటించింది. అయితే, ఈ గుండెపోటుకు ఒక తేనెటీగ (bee) మింగడం వల్ల కలిగిన తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య (anaphylactic shock) కారణం.
2025 జూన్ 12, గురువారం సాయంత్రం, ఇంగ్లాండ్‌లోని విండ్సర్‌లోని గార్డ్స్ పోలో క్లబ్‌లో క్వీన్స్ కప్ పోలో టోర్నమెంట్‌లో ఈ ఘటన జరిగింది. సంజయ్ కపూర్ తన ఆరియస్ పోలో టీమ్ తరపున సుజన్ టీమ్‌తో ఆడుతున్నారు. సంజయ్ ఆట సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ ఆయన నోట్లోకి వెళ్లిపోయింది. ఈ తేనెటీగ ఆయన గొంతులో లేదా నోటిలో కుట్టినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీని వల్ల తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య, అనఫిలాక్సిస్ (anaphylaxis), ఏర్పడినట్లుగా తెలుస్తోంది.
సంజయ్ ఆటను ఆపమని కోరి, ఆట మైదానం నుంచి బయటకు వెళ్లిన తర్వాత కుప్పకూలిపోయారు. వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ, ఆయనను కాపాడలేకపోయారు. అనఫిలాక్సిస్ అనేది ఒక తీవ్రమైన, ప్రాణాంతక అలెర్జీ. రక్తపోటు ఆకస్మికంగా పడిపోవడం, శ్వాసనాళాలు ఇరుకైపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీస్తుంది నోటి లేదా గొంతు లోపల తేనెటీగ కుట్టడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది శ్వాసనాళాలలో వాపు కలిగిస్తుంది, ఇది శ్వాస ఆడకుండా చేస్తుంది. సంజయ్ కపూర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నారు. అయినా ఆయనను ఓ తేనేటీగ నిమిషాల్లో చంపేసింది.
Sanjay Kapur was a billionaire. Successful Entrepreneur & Businessman. But even in his death he's just being reduced as ex-husband of Karishma Kapoor.
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 13, 2025
If a successful woman in her own self was being recognised with identity of her ex husband like this in her death, there would… pic.twitter.com/6sxzh5ieDf
ఎలక్ట్రిక్ వాహన భాగాల తయారీలో ప్రపంచస్థాయి సంస్థగా సోనా కామ్ స్టార్ నిలిచింది. సంజయ్ బ్రిటన్ ఉన్నత వర్గాలతో, ముఖ్యంగా ప్రిన్స్ విలియం వంటి రాజకుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన బ్రిటన్ పోలో సర్క్యూట్‌లో ప్రముఖ వ్యక్తిగా ఉండేవారు. సంజయ్ కపూర్ .. హీరోయిన్ కరిష్మా 2003 లో పెళ్లి చేసుకున్నారు. 2016లో విడిపోయారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.





















