Viral News: లక్కున్నోడు.. రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసిన తండ్రి, 35 ఏళ్ల తరువాత వాటి విలువ ఎంతో తెలుసా!
JSW Shares Worth Rs | ఓ వ్యక్తి 1990లో ఒక లక్ష రూపాయలకు జిందాల్ కంపెనీ షేర్లు కొన్నారు. నేటి వాటి విలువ ఏకంగా రూ.80 కోట్లు కావడం హాట్ టాపిక్ గా మారింది.

Man Uncovers Father's 1990s JSW Shares Worth Rs 1 Lakh | మనం తీసుకునే నిర్ణయం మంచిది, అయితే మన సంకల్పం గొప్పది అయితే ఏదో రూపంలో మంచే జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అదే విధంగా తమ పిల్లల భవిష్యత్ కోసం బంగారు బాటలు వేయాలని భావించి ఓ తండ్రి చేసిన ప్రయత్నం నేడు వారి సంతానికి కోట్లు తెచ్చి పెట్టింది. అదృష్టం ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం అనడానికి ఈ ఘటన ఉదాహరణగా మారింది.
దాదాపు 35 ఏళ్ల కిందట చేసిన లక్ష రూపాయల పెట్టుబడి విలువ నేడు రూ.80 కోట్లు అయింది. 1990లో ఓ వ్యక్తి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేశాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాక ఆ పేపర్లు ఇంట్లో ఎక్కడో పెట్టారు. దాదాపు 35 ఏళ్ల తరువాత ఆయన కుమారుడికి ఈ షేర్స్ డాక్యుమెంట్స్ కనిపించడంతో వివరాలు చెక్ చేసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మూడున్నర దశాబ్దాల కిందట తన తండ్రి చేసిన లక్ష రూపాయల పెట్టుబడి నేడు రూ.10 లక్షలో, కోటి రూపాయలో కాదు ఏకంగా రూ.80 కోట్లకు చేరింది. సౌరవ్ దత్తా అనే నెటిజన్ ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. అయితే ఇది నిజమా కాదా అనే అనుమానం సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు.
Guy on Reddit discovered JSW shares bought by his dad in the 1990s for ₹1L.
— Sourav Dutta (@Dutta_Souravd) June 7, 2025
Worth ₹80Cr today.
Power of buy right sell after 30yrs. pic.twitter.com/mZTpGt4LII
జిందాల్ విజయనగర్ స్టీల్ లిమిటెడ్ అనే పేరుతో ఉన్న కంపెనీ షేర్లను 1990లో ఓ వ్యక్తి కొన్నాడు. అయితే సరైన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ ప్రయోజనం ఉంటుంది. లాంగ్ టర్మ్ వరకు ఆగితే ఫలితాలు ఊహించని స్థాయిలో ఉంటాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇది చూసిన వారు పూర్తి వివరాల కోసం చెక్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం అతడి పంట పండింది, వాళ్ల నాన్న చేసిన మంచి ప్రయత్నం వృథా కాలేదు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
కొందరైతే ఈ పోస్ట్ చూసి జోక్ అంటున్నారు. మరికొందరేమే ఇన్వెస్ట్ చేసి మరిచపోవడం ద్వారా కలిగిన భారీ ప్రయోజనం అని చెబుతున్నారు. తమ తల్లిదండ్రులు, లేక తాతనో ఇలాగే ఎన్నో షేర్లు కొన్నారని.. వాటిని ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియడం లేదని కొందరు నెటిజన్లు స్పందించడం విశేషం. అయితే సంబంధిత కంపెనీని సంప్రదిస్తే ప్రయోజనం ఉంటుందని, వాటి విలువను కచ్చితంగా క్లెయిమ్ చేయవచ్చు అని సూచిస్తున్నారు.






















