SAI: సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు, వివరాలు ఇలా!
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), ఎన్ఆర్‌సీ సోనేపట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), ఎన్ఆర్‌సీ సోనేపట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌తో పాటు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేట్/ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 04 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* యంగ్ ప్రొఫెషనల్(అథ్లెట్ రిలేషన్ మేనేజర్)
మొత్తం ఖాళీలు: 04
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌తో పాటు స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేట్/ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జీతం: నెలకు రూ.50,000.
పోస్టింగ్ స్థలం: ఎన్‌సీఓసీ సోనేపట్, ఎన్‌సీఓసీ రోహ్‌తక్.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.07.2023.
Also Read:
తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా!
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..