By: Ram Manohar | Updated at : 06 Aug 2023 12:00 PM (IST)
రష్యా ఉక్రెయిన్ సమస్యని పరిష్కరించడం కన్నా భారత్‌కి గొప్ప ఆనందం ఇంకేమీ ఉండదని అజిత్ దోవల్ అన్నారు.
Russia-Ukraine War:
సౌదీ అరేబియాలో భేటీ..
జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో భారత్ ఎప్పుడూ చొరవ చూపిస్తుందని వెల్లడించారు. ఈ యుద్ధం ఆగిపోవడం కన్నా భారత్‌కి సంతోషాన్నిచ్చే విషయం ఇంకేదీ ఉండదని స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఏదో విధంగా ప్రభావితం అవుతున్నాయని అన్నారు అజిత్ దోవల్. అందుకే...అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అక్కడ శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. UN చార్టర్, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా సమస్య పరిష్కారానికి సహకారం అందిస్తామని తేల్చి చెప్పారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో కీలక భేటీకి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి శాంతియుత మార్గాలపై ఈ సమావేశంలోనే చర్చలు జరిగాయి.
"ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యని పరిష్కరించేందుకు భారత్ ఎప్పుడూ ముందుకొస్తుంది. ఈ సమస్య పరిష్కారమవడం కన్నా ఆనందం భారత్‌కి మరింకేదీ ఉండదు"
- అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు
NSA Ajit Doval at the meeting on Ukraine held in Jeddah, on 5th August -
— ANI (@ANI) August 6, 2023
India has regularly engaged both Russia and Ukraine since the beginning of the conflict at the highest levels: Sources
India supports the global order based on principles enshrined in UN Charter and… pic.twitter.com/SqghJo43lG
రెండ్రోజుల భేటీ
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిల్ సల్మాన్ నేతృత్వంలో రెండ్రోజుల పాటు సమావేశాలకు పిలుపునిచ్చారు. ఈ భేటీకి దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా అధికారులు వచ్చారు. అయితే...ఈ సమావేశానికి రష్యాకి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అమెరికా భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ కూడా హాజరయ్యారు. భారత్ తరపున అజిత్ దోవల్ వెళ్లారు. ఆ సయమంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రస్తావన రాగా...మొదటి నుంచి ఈ సైనిక చర్యను భారత్ గమనిస్తోందని దోవల్ స్పష్టం చేశారు.
"ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు అందరూ సహకరించాలి. భారత్ తరపున ఈ సమావేశానికి హాజరు కావడం వెనక ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. భారత్ తరపున ఉక్రెయిన్‌కి అందాల్సిన సాయం అందుతోంది. మానవతా దృక్పథంతో సహకారం అందిస్తున్నాం. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. భారత్ విధానం ఇదే"
- అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు
రష్యన్ న్యూస్ ఏజెన్సీలు వెల్లడించిన వివరాల ప్రకారం...తమ దేశ సైన్యం సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకున్నాకే ఈ చర్చలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు జెలెన్‌స్కీ. అంటే...రష్యా సైనికులు అక్కడి నుంచి వెనుదిరిగితే కానీ అందుకు ఒప్పుకోనని పరోక్షంగా చెప్పారు. క్రిమియా, డాన్‌బాస్, ఖేర్సాన్ ప్రాంతాలు ఈ యుద్ధానికి ముందు ఉక్రెయిన్ అధీనంలోనే ఉన్నాయి. ఎప్పుడైతే రష్యా సైనిక చర్య మొదలు పెట్టిందో అప్పటి నుంచి అవి రష్యా చేతుల్లోకి వెళ్లిపోయాయి. వీటిపై పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది ఉక్రెయిన్ సైన్యం. ఇది సాధించిన తరవాతే చర్చలకు వెళ్తామని అంటున్నారు జెలెన్‌స్కీ.
Also Read: హరియాణాలో ఇంకా తగ్గని అలజడి, నూహ్‌లో మరో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్ బంద్
Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరోసారి ఉద్రిక్తత, జేసీబీలతో చేరుకుంటున్న టీఎస్ పోలీసులు
Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు
Telangana Exit Poll Results 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి, ఏంటంటే!
Anantapur News: వైద్యం వికటించి చిన్నారికి తీవ్ర అస్వస్థత, అధికారులు పట్టించుకోలేదని ఫ్యామిలీ ఆందోళన
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
Best Bikes Under Rs 1 lakh: రూ.లక్షలోపు బెస్ట్ బైకులు - బడ్జెట్ ధరలో డబ్బులకు న్యాయం!
/body>