Russia School Shooting: పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులు- 13 మంది మృతి!
Russia School Shooting: రష్యాలో ఓ పాఠశాల తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
Russia School Shooting: రష్యాలో ఓ పాఠశాలలో దుండగుడు బీభత్సం సృష్టించాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
#BREAKING Death toll in central Russia school shooting rises to 13: investigators pic.twitter.com/wbdQpiQh2n
— AFP News Agency (@AFP) September 26, 2022
ఇదీ జరిగింది
రష్యాలోని ఇజెవ్స్క్లో సోమవారం ఈ ఘటన జరిగింది. 1 నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులు ఉండే పాఠశాలలోకి దుండగుడు తుపాకీతో చొరబడ్డాడు. ముందుగా సెక్యూరిటీ గార్డ్‌పై కాల్పులు జరిపాడు. ఆ తర్వతా పాఠశాలలోకి వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు.
అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ పాఠశాలను చుట్టుముట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు.
The number of schoolchildren killed in today’s school shooting in Izhevsk, Russia, has increased to 5.
— Visegrád 24 (@visegrad24) September 26, 2022
Some local media outlets report that the perpetrator was a mobilized soldier who didn’t want to go to Ukraine.
He shot himself during the massacre. pic.twitter.com/A5qmH8J41T
పడవ ప్రమాదం
సిరియాలో ఇటీవల జరిగిన ఘోర పడవ ప్రమాదంలో లెబనాన్‌కు చెందిన 86 మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. వీరంతా లెబనాన్ నుంచి సిరియా వెళుతున్న వలసదారులు. మృతిచెందిన వారంతా లెబనాన్, సిరియా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 150 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు.
దాదాపు 50 మందికిపైగా గల్లంతు కాగా, 20మంది సిరియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మెడిటెర్రేనియన్ తీరంలో జరిగిన అత్యంత దారుణమైన దుర్ఘటనల్లో ఇదొకటని అధికారులు చెప్పారు.
లెబనాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా బతకు జీవుడా అంటూ అక్కడి ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. లెబనాన్‌లో 90 శాతం మందికి ఉద్యోగాలు లేకపోవడం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. బతకడం కన్నా సముద్రంలో పడిచావడమే మేలని పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: US-Pak Relationship: 'పాక్‌తో దోస్తీ ఏ మాత్రం మంచిది కాదు'- అమెరికాకు భారత్ వార్నింగ్!
Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీ ప్రకటించిన గులాం నబీ ఆజాద్- పేరు ఏంటంటే?.